జీవితా రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులతో పోటీకి సై అంటున్నారు. ఆతర్వాత హేమ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇలా మా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వార్తల్లోకి వచ్చిన జీవిత ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే.. జీవిత రాజశేఖర్‌లకు ఫిల్మ్ నగర్‌లో భారీ ప్రాపర్టీ ఉందని సమాచారం. ఇందులో వేరే సంస్థల వాటా కూడా ఉంది. అయితే.. జీవితా రాజశేఖర్ కు మాత్రం దాదాపుగా 200 కోట్ల రూపాయల షేర్ ఉంటుందట.
ఈ ప్రాపర్టీని అమ్మి వేరే చోట కొనాలని జీవిత రాజశేఖర్ ప్లాన్ చేస్తున్నారని.. ఈ ప్రాపర్టీని ఉపాసన కొనాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. జీవిత రాజశేఖర్ ప్రాపర్టీలోనే హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు, ఎన్టీఆర్ కు కూడా షేర్లున్నాయని తెలుస్తోంది. విప్రో సర్కిల్ దగ్గర స్థలాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర్ దంపతులు తమ ప్రాపర్టీని అమ్మేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో పాలు నీళ్లలా కలిసిపోయింది.
ఉపాసనలో సామాజిక బాధ్యత చాలా ఉంది. హెల్త్ విషయంలో తనకు తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతే కాదు తన అపోలో హెల్తె కేర్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మెగా కోడలు ఉపాసన బిజినెస్ వ్యవహారాలలోను చాలా చురుకుగా ఉంటుంది. ఈమె జీవిత రాజశేఖర్ ఆస్థిని కొనాలనుకోవడం ఆసక్తిగా మారింది. ఈ మేరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఈ వ్యవహారంకి సంబంధించి వస్తున్న వార్తలలో వాస్తవం ఎంత ఉందనేది త్వరలో తెలుస్తుందేమో చూడాలి.
Must Read ;- మంచు విష్ణు ప్రపోజల్ కి జీవిత ఓకే చెబుతారా..?











