కేసీఆర్ నిర్ణయానికి నిరుద్యోగులు హర్షం!
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని భారీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేశారు. మొత్తం ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. నేటి నుంచే ప్రకటించిన నోటిఫికేషన్ వెలువడుతోందని చెప్పారు. మరోవైపు కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యా శాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.
తక్షణమే 80,039 పోస్టుల భర్తీ..
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న 91,142 పోస్టులో తక్షణమే 80,039 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాత రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్ తెలిపారు.
Must Read:-సీఎం కేసీఆర్ ఢిల్లీకి ప్రయాణం! అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ!!