వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు బెయిల్‌పై మిలటరీ ఆసుపత్రి నుంచి విడుదల కాగానే వెంటనే అరెస్టు చేసి తీసుకురావాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారని తెలుస్తోంది.ఇప్పటికే గుంటూరు నుంచి కొందరు పోలీసులు మిలటరీ ఆసుపత్రి వద్ద మకాం వేశారని రఘురామరాజు తరఫు లాయర్లు చెబుతున్నారు.గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిపై రఘరామరాజు తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ కోర్టు దిక్కార నోటీసులు జారీ చేశారు.రఘురామరాజు మిలటరీ ఆసుపత్రి నుంచి బయటకు రాగానే అరెస్టు చేస్తారనే అనుమానంతోనే,పూర్తి చికిత్స అందించాలని ఎంపీ మిలటరీ ఆసుపత్రి డాక్టర్లను కోరినట్టు తెలుస్తోంది.ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే విడుదల చేయాలనుకుంటే మాత్రం తన ఆరోగ్య పరిస్థితిని డిశ్చార్చ్ రిపోర్టులో వివరించాలని ఆయన కోరారు.
మరలా అరెస్టు తప్పదా..
వైసీపీ ఎంపీని మరలా అరెస్టు చేస్తారని తెలుస్తోంది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదల కాగానే మరికొన్ని కేసులు సిద్దం చేసి,ఆయన్ను అరెస్టు చేసి గుంటూరు తరలించాలని చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.అందుకే రఘురామరాజు మిలటరీ ఆసుపత్రిలోనే పూర్తిగా వైద్య చికిత్స తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.తాను కోలుకునేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని మిలటరీ ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పడంతో ఆయన మరో నాలుగు రోజులు చికిత్స పొందనున్నారు.ఆ తరవాత బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Must Read ;- గుంటూరు ఎస్పీపై నారా లోకేశ్ ఆగ్రహం











