దేశంలో కరోనా కేసుల నమోదు చాలా వరకు తగ్గాయి అనే మాట అక్షర సత్యం. ఒకానొక పరిస్థితిలో దాదాపు రోజుకు లక్ష కేసుల దగ్గర్లో నమోదైన రోజులు కూడా ఉన్నాయి. క్రమంగా కేసులు నమోదు తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో మొదటి నుండి కేసులు నిలకడగా ఉన్నా.. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం కేసులు ఒక్కసారిగా బెంబేలెత్తించాయి. ఈ క్రమంలో మరణాల నమోదు కూడా కలవరపెట్టింది. క్రమంగా కేసులు గణనీయంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా జీవనం తిరిగి మామూలు స్థితికి చేరుకుంది. కేసులు నమోదు తక్కువగా ఉన్నా కూడా ఇప్పటికి కొన్ని రాష్ట్రాలలో నమోదవుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. దేశంలో కేసులు కోటి దాటిన సందర్భంగా అసలు కరోనా పరిస్థితులేంటో తెలుసుకుందాం రండి.
కేసులు.. రికవరీలు..
దేశవ్యాప్తంగా 1,00,04,599 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. అందులో దాదాపు 95,50,712 కేసులు కరోనా నయమయ్యారు. దీన్ని బట్టి రికవరీ రేటు 95.46% నమోదైంది. ఇక దేశంలో యాక్టివ్ కేసులు 3,08,751. మొత్తం కేసుల్లో 3.09% యాక్టివ్ కేసులుగా నమోదయ్యాయి. ఇక మరణాల వివరాలు చూస్తే 1,45,136 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా కేసల మొత్తంలో మరణాల రేటు 1.45% గా నమోదైనట్లు అధికరక లెక్కులు చెప్తున్నాయి.
Must Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం
📍#COVID19 India Tracker
(As on 19 December, 2020, 08:00 AM)➡️Confirmed cases: 1,00,04,599
➡️Recovered: 95,50,712 (95.46%)👍
➡️Active cases: 3,08,751 (3.09%)
➡️Deaths: 1,45,136 (1.45%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafeVia @MoHFW_INDIA pic.twitter.com/gzJso2nCmb
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 19, 2020
Also Read ;- మంగోలియా కరోనాను ఎలా జయించిందో తెలుసా?
రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి
కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. దాదాపు 18,88,767 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. అందులో 17,78,722 కేసులు నయమవ్వగా.. ఇప్పటికీ 61,471 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే 48,574 మంది కరోనా దాటికి ప్రాణాలు వదిలారు. అన్ని రాష్ట్రాలలో జార్ఖండ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల కంటే కేసులు, మరణాలు తక్కువగా నమోదైన రాష్ట్రం జార్ఖండ్ అని చెప్పాలి. డేంజర్ స్థానంలో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. అయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితిలో చోటు చేసుకున్నా అనూహ్య మార్పు కాస్త ఊరటనిస్తుంది.
వ్యాక్సిన్‌తో అంతా సర్దుకుంటుందా..
వ్యాక్సిన్ వస్తే చాలు.. అంతా సర్దుకుంటుంది.. ఇదే తరహాలో చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ వచ్చినంతమాత్రానా జాగ్రత్తలు పాటించని వారిని కాటేయడానికి కరోనా సిద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వ్యాక్సిన్ వచ్చినా.. సరఫరా పూర్తి స్థాయిలో జరగడానికి 3 నుంచి 4 నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కరోనా మరోసారి తన దెబ్బ రుచి చూసిస్తుందనడంలో సందేహం లేదు.
Also Read ;- కరోనా వ్యాక్సిన్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా?