బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా కంప్లీట్ అయ్యింది. గ్రాండ్ ఫైనల్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడం.. ఫైనల్ ని అదరగొట్టేయడం తెలిసిందే. చిరు – నాగ్ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్సో స్టేజ్ పై మరోసారి తెలిసింది. చిరు పై నాగ్, నాగ్ పై చిరు పొగడ్తల వర్షం కురిపించడం చూసి.. అటు చిరు ఫ్యాన్స్ కి, ఇటు నాగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. ఈ సీజన్ ని నాగార్జున అద్భుతంగా నడిపించారని.. ఆతర్వాత వచ్చే 5వ సీజనే కాదు.. 10 సీజన్ ల వరకు నాగార్జునే హోస్ట్ గా ఉండాలనుకుంటున్నాను అని చిరంజీవి చెప్పారు.
అయితే.. బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ గా నాగార్జున అనుమానమే అని టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటంటే.. ఈ సీజన్ కి నాగార్జునను ఒప్పించడమే చాలా కష్టం అయ్యిందట. అందుచేత బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ మెగాస్టార్ చిరంజీవి అంటూ టాక్ వినిపిస్తోంది. గతంలో నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరు అనే షోకి హోస్ట్ గా చేసారు. ఆ షో ఎంత సక్సస్ అయ్యిందో తెలిసిందే. ఆతర్వాత ఈ షోకు హోస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చేసారు. అలాగే బిగ్ బాస్ షోకు కూడా మందుగా నాగార్జున హోస్ట్ గా చేసారు. ఇప్పుడు ఆ బాధ్యతను చిరంజీవి స్వీకరించనున్నారు అని బలంగా వినిపిస్తుంది.
అయితే.. చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆచార్య తర్వాత వేదాళం రీమేక్, లూసీఫర్ రీమేక్.. బాబీ డైరెక్షన్ లో మూవీ.. ఇలా లిస్ట్ పెద్దదే ఉంది. అందుచేత బిగ్ బాస్ సీజన్ 5 టైమ్ కి చిరు బిజీగా ఉంటే.. వేరే స్టార్ ను చూస్తారంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కి చాలా టైమ్ ఉంది. అప్పటి ఏం జరగనుందో..? ఎవరు బిగ్ బాస్ 5 హోస్ట్ ఎవరవుతారో చూడాలి.
Must Read ;- బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే హైలైట్స్