కరోనా మహమ్మారి ప్రపంచంలోని లక్షలాది మంది చావులను బలిగొన్నది.. ఇంకనూ బలికొంటునే ఉన్నది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. అయినా కానీ ఇప్పటికీ కరోనాను కట్టడి చేసే పూర్తి స్థాయి మందుగానీ, వైద్యం గానీ అందుబాటులో లేదు. ఇతర రోగాలకు వాడే మందులనే ఈ కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనాకు మందు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఓ మహిళ సైంటిస్టు కరోనా వైద్యానికి సంబంధించి ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రకారంగా కరోనా రోగులకు వైద్యం అందిస్తే మరణాల సంఖ్యను కట్టడి చేయొచ్చని తన పరిశోధనలో కనుగొన్నారు.
కరోనా వైరస్ శరీరంలో సోకితే అది అవయవాలపై దాడి చేసి మరణాలకు దారితీస్తుంది. కరోనా వైరస్ రోగుల్లో తమ ఇమ్యూన్ సిస్టంపై తీవ్ర ప్రభావం చూపి లంగ్స్, ఇతర అవయవాలు ఫెయిల్యూర్ అయి ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకి చనిపోతున్న వారిలో అవయవాలు ఫెయిల్ అయి చనిపోతున్న వారే అధికంగా ఉంటున్నారు. అందుకే అవయవాలపై వైరస్ దాడి చేసే ఈ సిస్టంను అడ్డుకుంటే కరోనా చావులను కట్టడిని సులువుగా ఆపేయొచ్చని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సైంటిస్టు డాక్టర్ తిరుమల దేవి ఆధ్వర్యంలోని బృందం పరిశోధనలు జరిపింది. కరోనా వల్ల అవయవాలు ఫెయిల్ అయ్యే సెల్ డెత్ సిగ్నలింగ్ పాత్ వే సిస్టంను కనుగొన్నది. కరోనా వైరస్ మనిషి శరీంరంలోని అవయవాలపై దాడి చేయకుండా ఉండేందుకు ఈ సెల్ డెత్ సిగ్నలింగ్ పాత్ వేను అడ్డుకుంటే కరోనా చావులను చాలా వరకు కట్టడి చేయొచ్చని వారు చెప్తున్నారు.
Must Read: ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
ఎలుకలపై రీసెర్చ్..
డాక్టర్ తిరుమల దేవి సొంతూరు వరంగల్. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో బీఎస్సీ(బీజడ్‌సీ)లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశారు. కొన్నాళ్ల తరువాత ఆమె ఆమెరికాలోని మెంఫిస్ సిటీలోని సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్సిటల్‌లో 2007లో చేరారు. అక్కడ ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇమ్యునాలజీపై పరిశోధనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ఆధ్వర్యంలోని బృందం కరోనా ట్రీట్‌మెంట్‌పై ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో సెల్ డెత్ సిగ్నలింగ్ పాత్ వేను కనుగొన్నారు. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన వివరాలను ఇటీవల సెల్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. కనుగొన్న ఈ కొత్త విషయం ద్వారా అవయవాలు దెబ్బతిన కుండా మందులను వాడితే కరోనా చావులను కట్టడి చేయొచ్చని తిరుమల దేవీ, ఆమె బృందం కనుగొన్నారు.
Also Read: డిసెంబర్‌లో 10 కోట్ల కరోనా డోసులు పంపిణీ!











