ఫైజర్ తర్వాత యుకే ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. కొత్తరకం కరోనా దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు టీకా అందించడానికి కొవిషీల్డ్ ఆమోదం తెలుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రాజెన్‌కా సిఇఓ పాస్కల్ సోరియట్ అధికారకంగా తెలిపారు. యుకే ఆమోదం అత్యంత కీలకమైన చర్యగా అభిప్రాయపడ్డారు. సంస్థ అందించిన నివేదిక ప్రకారం టీకా 70 శాతం సామర్థ్యం కలిగి ఉందని.. పరిస్థితుల ఆధారంగా 90 శాతం వరకు సామర్థ్యం నమోదవుతుంది. వీటితో పాటు టీకా సురక్షితమైనదని వివారాల్లో వెల్లడి చేసింది. వాటిని పరిశీలించిన మీదట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సంస్థ.
100 మిలియన్ల డోసులకు ఆర్డర్స్
ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ 6 లక్షల మందికి ఇచ్చినట్లుగా అధికారక లెక్కల ద్వారా వెల్లడవుతుంది. ఇప్పుడు కొవిషీల్డ్ 100 మిలియన్ల డోసులకు ప్రభుత్వ ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కొవిషీల్డ్ టీకాను 50 మిలియన్ల ప్రజలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ దేశాల ఆమోదం కోసం ఎదురుచూస్తున్న కొవిషీల్డ్‌కు యుకే ఇచ్చిన ఆమోదం కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆమోదం ఆధారంగా ఇతర దేశాలలో కొవిషీల్డ్ ఆమోదం పొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడానికి సమాయత్తమవుతుంది.
Must Read ;- టీకా జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
In 2020, teams across AstraZeneca have risen to the challenges #COVID19 has posed to global health. Today’s advancement is a significant step forward in the fight against this pandemic. #WhatScienceCanDo pic.twitter.com/z8LvuFFMhS
— AstraZeneca (@AstraZeneca) December 30, 2020
భారత్‌లో ఆమోదం పొందే అవకాశం
యుకేలో ఆమోదం పొందగానే భారత్‌లో కూడా ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీకాకు సంబంధించిన వివరాల నివేదికను ఐసియంఆర్‌కు సమర్పించిన సంస్థ భారత్ ఆరోగ్య సంస్థ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే భారత్ కోసం 50 మిలియన్ల డోసులను సిద్ధం చేసినట్లు సీరమ్ ఇన్‌స్టిస్యూట్ ప్రకటించింది. ఆమోదం పొందిన మరుక్షణం దేశ వ్యాప్తంగా టీకా అందించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఆ సంస్థ సిఇఓ అదార్ పునావాలా ప్రకటించారు. అంతేకాదు.. ప్రజలకు అందుబాటులో ధరలో అందించడానికి తమ సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇక మిగిలిన వాటి విషయానికొస్తే.. ఫైజర్ టీకాకు సంబంధించిన నివేదికను ఐసియంఆర్‌కు పూర్తి స్థాయిలో అందించలేదని తెలుస్తుంది. ఇక భారత్ బయోటెక్, కొవ్యాక్సిన్ టీకా పూర్తి వివరాలు అందించినా.. మూడో దశ క్లినికల్ ట్రైల్స్ ఇంకా పూర్త కాకపోవడంతో ఈ టీకాకు ఎమర్జెన్సీ ఆమోదం దక్కే అవకాశాలు తక్కువ అని విశ్లేషకులు చెప్తున్నారు.