టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ కమ్ బ్యాక్ సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి ‘విరూపాక్ష’, ఓం శివమ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక కీలకమైన పాత్రలో సాయి పల్లవి నటించనున్నదని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ ఆమె ను కలిసి కథను వినిపించాడని సమాచారం. మొదట సాయి పల్లవి ఈ సినిమాను రిజక్ట్ చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే మరొకసారి క్రిష్, సాయి పల్లవిని కలిసి కన్విన్స్ చేసాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని ఒక ముఖ్యమైన పాత్ర లో సాయి పల్లవి మెరవనున్నదని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాను భారీ వ్యయంతో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. మరి ఈ సినిమా తో పవన్ ఏ తరహా రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి.
Must Read ;- లుంగీ లుక్ తో ఆకట్టుకుంటోన్న బర్త్ డే బాయ్