స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. శరవేగంగా జరుగుతున్న సినిమాకు అనుకోని కష్టం ఒకటి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో విజయ సేతుపతి ఫైనల్ అయ్యారు. కాకపోతే ‘పుష్ప’ సినిమా షూటింగ్ కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. తిరిగి ఈ మధ్యనే ప్రారంభం అయిన ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. అందుకు కారణం విజయ్ తమిళ్ లో ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ కూడా ఈ మధ్యనే మొదలయ్యాయి. దీంతో ‘పుష్ప’ సినిమాకు డేట్స్ ఇవ్వడం పెద్ద తలనొప్పిగా తయారైంది విజయ్ కు. అందుకనే సినిమా నుండి తప్పుకున్నారు.
విజయ్ సేతుపతి స్థానంలో ఇప్పటికే కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర, తమిళ్ హీరో ఆర్య, కన్నడ స్టార్ హీరో సుదీప్ పేర్లు వినపడ్డాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు సుకుమార్ తమిళ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ ను తీసుకొనే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విక్రమ్ ను కలిసిన సుకుమార్.. తన పాత్ర గురించి చర్చినట్లు వార్తలు వినబడుతున్నాయి. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉండడంతో విక్రమ్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.
విక్రమ్ తన అభిప్రాయం చెప్పే వరకు విలన్ లేకుండానే షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ వార్తపై స్పష్టత వస్తుందని టాక్ . ఇక ‘పుష్ప’ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ ఆయన బన్నీ ఫస్ట్ లుక్ పై అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే సుకుమార్ సినిమా అంటే ఐటెమ్ సాంగ్ తప్పకుండా ఉంటుంది. ‘పుష్ప’ సినిమాలో కూడా ఒక ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సుకుమార్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ ఎన్ని సరికొత్త రికార్డులను సృష్టిస్తాడో చూడాలి మరి.
Must Read ;- చిరూ కథ నచ్చలేదన్నాం .. బన్నీ సినిమా చేయలేకపోయాం











