మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు తెరలేచినట్టే. ఫిలింఛాంబర్ ఆవరణలోని దాసరి నారాయణరావు విగ్రహం వద్ద కొంతమంది సభ్యులు శనివారం సమావేశమై మా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే ఎన్నికలు జరిపించాలని వీరు డిమాండు చేశారు. మా ఎన్నికల నిర్వహణలో కాలయాపన జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణ వైపే ప్రస్తుత బాడీ నిర్ణయించుకుంది. అందుకే రాత్రి మా అధ్యక్షుడు వి.కె. నరేష్ తన ఇంట్లో కొందరు మా సభ్యులకు డిన్నర్ ఏర్పాటుచేశారు.
ఇంతకాలం తనకు అండగా ఉన్నందుకు ‘మా’ సభ్యులకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్టీకి అలీ, పృథ్వీ, శివబాలాజీ, సంపూర్ణేష్ బాబు, కరాటే కళ్యాణి, రాజ్ కుమార్ లాంటి వారంతా హాజరయ్యారు. దాదాపు 100 మంది సభ్యులు ఈ డిన్నర్ కు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల బరిలోకి ఎవరెవరు దిగబోతున్నారన్న అంశం మీద రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్ ప్యానల్ ఒక్కటే మీడియా ముందుకు వచ్చింది. మిగిలిన ప్యానల్స్ ఏమైనా ఉంటే ఎన్నికల తేదీ ప్రకటించగానే వెల్లడయ్యే అవకాశం ఉంది.
నటి జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు, కరాటే కళ్యాణి లాంటి వారంతా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పోటీ ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్స్ మధ్య ఉండే అవకాశం ఉంది. మా అసోసియేషన్ అంతర్గత వ్యవహారల మీద కామెంట్లు చేసిన నటి హేమ మీద క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొని ఉంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాన్న డిమాండు ఊపందుకుంది. నటుడు కృష్ణంరాజు కూడా దీనిపై స్పందించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
Must Read ;- నటి హేమపై క్రమశిక్షణ సంఘం చర్య?