బిగ్ బాస్ 4లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయంలో ఉత్కంఠ ఏమీ లేదు. అందరూ మోనాల్ ఎలిమినేషన్ తప్పదని అనుకున్నారు. సాధారణంగా వారాంతంలో ఈ ఎలిమినేషన్ మీద చర్చలు నడుస్తుంటాయి. ఆదివారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తిని ప్రకటిస్తారు. దాదాపు 10 వారాల షో పూర్తయింది. మనకు అందిన సమాచారం ప్రకారం మోనాల్ కు బదులు లాస్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం ఉంది.
Also Read:-ఆకర్షిస్తున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్
అందువల్ల ఈ వారం ఎలిమినేషన్ మీద ఉత్కంఠ లేదు. ఈ వారం ఫోకస్ అంతా లాస్య, మోనాల్ మీద ఉంది. ఓట్ల ప్రకారం చూస్తుంటే ఎట్ప్డూ సేఫ్ అవుతూనే ఉన్నాడు. కాబట్టి అతన్ని పట్టించుకోనవసరం లేదు. పైగా టైటిల్ విన్నర్ అతనే అనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. ఎవరికీ దక్కని విధంగా అభిజిత్ కు ఓట్లు పడుతున్నాయి. ఇక సోహైల్ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అరియానా, హారికల విషయానికి వస్తే అందరినీ ఆకట్టుకుంటూ ముందుకుపోతోంది అరియానా.
Must Read:-బిగ్ బాస్ హౌస్ లో నోయల్-లాస్య ఢిష్యుం ఢిష్యుం
కెప్టెన్ కావడంతో హారిక కూడా గట్టెక్కినట్టే. ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్న మోనాల్ ను ఏదో శక్తి రక్షిస్తున్నట్టు అనిపిస్తోంది. నిజానికి ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో మొదట వినిపించే పేరు మోనాలదే అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో మోనాల్ హారికకు మద్దతు ఇచ్చింది. హారిక మీద ప్రేమతో అఖిల్ ను పట్టించుకోక పోవడం అందరినీ ఆకర్షించింది. దీని పర్యవసానం లాస్య మీద పడినట్టు సమాచారం. మనకు తెలిసిన సమాచారం నిజమైతే లాస్య ఇంటికి వెళ్లిపోక తప్పదన్నమాట. ముందుకు దూసుకెళుతుందనుకున్న లాస్య క్రమేపీ వెనకబడిపోయింది.
Must Read:-బిగ్ బాస్‌పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆమె వివాదాల జోలికి పోకుండా ఉండటమే మైనస్ అయినట్లుంది. తన బొమ్మ చూపిస్తూ దిమ్మ తిరిగేలా చేస్తోంది మోనాల్. ఆమె తెలివితేటల ముందు ఎవరి పప్పులూ ఉడకడం లేదు. అభి, అఖిల్ మధ్య దోబూచులాడుతూ ఆట సాగిస్తోంది. లాస్య ఇంటికి వెళ్లిపోతే షోలో ఎలాంటి మార్పులు వస్తాయన్న దాని మీద కూడా చర్చ జరుగుతోంది. రీఎంట్రీ ఉంటుందన్న ఊహాగానాలు పెరిగాయి. నోయల్ రీఎంట్రీ కావచ్చన్న మాట వినిపిస్తోంది. చూద్దాం ఏంజరుగుతుందో ఏంటో?
Also Read:-చెక్ పాయింట్ల ఫీడ్ బ్యాక్.. బిగ్ బాస్ రాంగ్ ట్రాక్