రావడం ఆలస్యం అవ్వచ్చు కానీ.. రావడం మాత్రం పక్కా అని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో చెప్పినట్టుగా.. అన్నయ్య చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడం ఆలస్యం అయ్యింది కానీ… పక్కాగా వచ్చేశారు. ఆమధ్య సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తనదైన స్టైల్ లో పోస్టులు పెడుతూ.. వార్తల్లో నిలిచారు. లేట్ గా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ న్యూస్ లు, బర్త్ డే విషేస్ లు ఇలా ఎన్నె ఎన్నెన్నో పంచుకున్నారు. ఫ్యాన్స్ లో అయితే.. ఓ జోష్ నింపారని చెప్పచ్చు. దీంతో చిరంజీవి నుంచి ఏరోజు ఏ ట్వీట్ వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూసేది అభిమానగణం.
మాస్క్ వాడడం గురించి.. చికెన్ ఫ్రై చేయడం గురించి.. కొత్త సినిమాల గురించి.. ఇలా ఒకటేమిటి తనకు ఏది చెప్పాలనిపిస్తే.. దాని గురించి ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకునేవారు. తనకి కరోనా పాజిటివ్ అనే విషయాన్ని.. ఆతర్వాత కిట్ ప్రాబ్లమ్ వలన అలా వచ్చింది.. తనకు ఇప్పుడు కరోనా నెగిటివ్ అని ప్రకటించడం వరకు ఇలా అన్నింటిని సోషల్ మీడియా ద్వారా పంచుకునేవారు చిరంజీవి. ఇటీవల దీపావళికి గురువు కె.విశ్వనాథ్ ని కలిసిన విషయాన్ని.. పంచుకున్నారు. ఆతర్వాత సినీ పరిశ్రమకు వరాల జల్లు కురిపించారు అంటూ సీఏం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియచేస్తూ పోస్ట్ పెట్టారు.
ఆతర్వాత నుంచి సోషల్ మీడియాలో చిరంజీవి యాక్టీవ్ గా లేరు. తన సినిమాల గురించి కానీ.. సినీ తారల పుట్టినరోజుల గురించి కానీ.. స్పందించలేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసిన ఫోటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయలేదు. ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే.. చిరంజీవి సందర్భం ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో స్పందించకపోవడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే. .చిరంజీవి కావాలనే.. సోషల్ మీడియాకి గ్యాప్ ఇచ్చారా..? లేక తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వలన గ్యాప్ వచ్చిందా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- చిరు కొత్త సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందట.. !











