నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 3 లక్షల మంది రైతులు 44 రోజులుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులతో 40 రైతు సంఘాల నేతలు ఇవాళ జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. చట్టాల రద్దుకే రైతు సంఘాలు పట్టుబట్టడంతో కేంద్ర మంత్రులు నిరాకరించారు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. చట్టాల్లో సవరణలు కోరాలని రైతు సంఘాల నాయకులకు విజ్ఙప్తి చేసినా వారు పట్టించుకోలేదు. చట్టాల రద్దుకే వారు పట్టుబట్టారు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపాలని నిర్ణయించారు.
నమ్మకం లేకే..
కేంద్ర మంత్రులు ఇస్తున్న హామీలపై రైతు సంఘాల నేతలకు నమ్మకం లేకే చట్టాల రద్దుకు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. మద్దతు ధర విషయంలో చట్టంలో రక్షణ కల్పించడానికి వెనకాడిన కేంద్ర మంత్రులు ఇస్తున్న హామీలపై రైతు సంఘాల నేతలకు నమ్మకం కుదరడం లేదు. అందుకే వివాదాస్పద చట్టాలను రద్దు చేస్తేనే రైతులు ఢిల్లీ నుంచి రైతులు ఖాళీ చేస్తారని లేదంటే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని 40 రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో చర్చల మధ్యలో వేరే గదిలోకి వెళ్లి ఉన్నత అధికారులతో చర్చించి వచ్చిన కేంద్ర మంత్రులు, చట్టాల రద్దుకు అంగీకరించలేదు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. ఈ నెల 15న మరో సారి చర్చలు జరపనున్నారు.
Must Read ;- నిరసన సెగ : రైతుల ప్రధాన డిమాండ్లు ఆ మూడే











