అమ్మైతే, ఆటకు శాశ్వత సెలవు ప్రకటించాల్సిందనే భావన నుండి నేటి తరం ఆడవాళ్లు సరికొత్త సవాళ్లతో సంచలనాలను సృష్టిస్తున్నారు. వారి పట్టుదలకు, నైపుణ్యానికి, పాటవానికి అమ్మ కావడం అనేది అడ్డంకి కాదని, అది కేవలం విరామం అని నిరూపిస్తున్న మహిళలు నేటి కాలంలో పెరుగుతున్నారు. అందుకు అనుగుణంగా ఫిఫా ప్రకటించిన ఈ నిర్ణయం మహిళా ప్లేయర్స్ లో సరికొత్త ఆశల్ని నింపింది. ఇంతకీ ఫిఫా తీసుకున్న అంతటి కీలక నిర్ణయం ఏమిటి?
గర్భం దాల్చడం అడ్డంకి కాదు
ఫిఫా చారిత్రాత్మక నిర్ణయంతో మహిళా ఫుట్ బాల్ ప్లేయర్ల్స్ కి అద్భుతమైన అవకాశాన్ని అందించింది. 14 వారాల పాటు అధికారక మాతృత్వ సెలవులు ప్రకటించింది. దీని వల్ల అందరి లాగే మహిళ ప్లేయర్స్ కూడా మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే… తిరిగి ఆటను కొనసాగించే అవకాశం వస్తుంది. ఇవి అధికారక సెలవులు కాబట్టి విరామం వారి ఆట కొనసాగింపుపూ ప్రభావం చూపే అవకాశాలు తక్కువ.
ఆటలకు మినహాయింపు ఎందుకు?
మాతృత్వ సెలవులు మహిళలకు వర్తిస్తాయి కదా, మరి అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? కానీ, అందరి మహిళల సంగతి వేరు ప్లేయర్ల్స్ పరిస్థితి వేరు. అందరికీ లభించినట్లు మహిళా ప్లేయర్స్ కి మాతృత్వ సెలవులు ఉండవు. తల్లిగా మారిన తర్వాత, వారు ఆటలో కొనసాగే విషయంలో ఒక నిబద్ధత, నియమంటూ లేదు. వారిని కచ్చితంగా తిరిగి ఆటలోకి తీసుకునే నియమం లేకపోవడంతో వారి కెరీర్ కి భద్రత, గ్యారెంటీ అనేవి ఉండవు. కానీ, మిగిలిన ఉద్యోగినిల విషయంలో అలా ఉండదు. మాతృత్వపు సెలవులు ముగిసిన తర్వాత వారిని కచ్చితంగా ఉద్యోగంలోకి తీసుకోవాలనే నియమం ఉంది.
ఇకపై కెరీర్ కొనసాగించవచ్చు
తాజాగా ఫిఫో నిర్ణయంతో ఫుడ్ బాల్ క్రీడాకారిణీలు తల్లిగా మారిన తర్వాత కూడా ఆటలో కొనసాగే కచ్చితమైన అవకాశం లభిస్తుంది. అంతేకాదు, వారికి బోర్డ్ నుండి జీతం కూడా లభిస్తుంది. ఇప్పటికే సానియా, సెరెనా వంటి క్రీడాకారిణిలు తల్లిగా మారిన తర్వాత కూడా తమ ఆటను కొనసాగిస్తూ మహిళా ప్లేయర్స్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఫిఫో నిర్ణయం గర్భం దాల్చన తర్వాత ఆటను కొనసాగించాలనుకునే వారికి గొప్ప అవకాశం అని చెప్పచ్చు.
Must Read ;- ఈమె ఇండియాలోనే అత్యంత సంపన్నురాలు