అమ్మాయిలకు ఎన్నో అంక్షలు, కానీ వాటిని అధిగమించి ఎప్పటికప్పడు తమ సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు మహిళలు. అమ్మాయిలు అన్నింటిలోనూ తమ ప్రతిభను నిరూపించుకున్నా, నేటికీ వారికి కొన్ని ఉద్యోగాల్లో ప్రవేశానికి అనుమతి లభించడం లేదు. అందులో మిలటరీ పైలట్ ఒకటి. ఇప్పుడు వాటిని సడలిస్తూ తీసుకున్నప్రభుత్వ నిర్ణయాలతో వాటిలోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోవడానికి సిద్ధ పడ్డారీ శ్రీలంక లో మొదటి మిలటరీ పైలట్లగా నియామకమైన రంగనా వీరవర్ధన, పవిత్ర గుణరత్నే.
ట్రైనింగ్ మాత్రం భారత్‌లోనే
శ్రీలంకలో బాధ్యతలు స్వీకరించిన ఈ ఇద్దరు మహిళలు భారత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీలంక పైలట్లు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఈ ఇద్దరు ట్రైనింగ్ తీసుకుంది భారత్ లోనే. అందునా తెలంగాణ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో ఈ శ్రీలంక వనితలు తమ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేయడం విశేషం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం తమ లక్ష్యం దిశగా సాగిపోయేలా తమను ప్రోత్సహించిన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియపరిచారు.
చిన్ననాటి కల
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా- రంగనా వీరవర్ధన తన అనుభవాలను పంచుకుంటూ ‘పైలట్ కావాలనేది నా చిన్ననాటి కల. దానికి నెరవేర్చుకునే దిశగా సాగిన నా పయనంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ట్రైనింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడి వారి ప్రోత్సాహం, మెలకువలు నేర్పించిన తీరు మెచ్చుకోతగినది. నేడు కేవలం నా కల నెరవేడం మాత్రమే కాదు, మిలటరీ పైలట్ గా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళగా గుర్తింపు లభించడంతో నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Must Read ;- హైదరాబాద్ అభివృద్ధిపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి!