Hero Ram Charan And Director Shankar Crazy Movie Update :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ రూపొందబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు, రాంచరణ్ ఇద్దరూ చెన్నైకి వెళ్లి శంకర్ ని కలసి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకుంది.
ఆగస్టు లేదా సెప్టెంబరు లో ఈ పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించనున్నారు. ఈ విషయాన్ని సాయి మాధవ్ బుర్రా ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. శంకర్ ని కలసిన తర్వాత ఆయనతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు. అంతే కాకుండా.. ‘జెంటిల్ మెన్ చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. అలాంటిది ఆయన చిత్రానికి ఇప్పుడు మాటలు రాస్తున్నా. శంకర్ సర్ కి, దిల్ రాజు గారికి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు థ్యాంక్స్’ అని బుర్రా సాయి మాధవ్ ట్వీట్ చేశారు. సాయిమాధవ్ సంభాషణలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇది పొలిటికల్ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. సో.. ఈ సినిమాలో మాటలు.. తూటాల్లా పేలడం ఖాయంలా కనిపిస్తోంది.
Must Read ;- ఎన్టీఆర్, చరణ్ లకు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారా..?











