సూపర్ స్టార్ రజినీ స్పీడు పెంచారు. శివ దర్శకత్వంలో అన్నాత్తేలో ఆయన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబరు 4న విడదుల కాబోతోంది. ఈ సినిమాలోని తొలి పాటను ఈరోజు విడుదల చేశారు. డి. ఇమ్మన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. సినిమాలో ఇది టైటిల్ సాంగ్. అన్నాత్తే.. అన్నాత్తే అంటూ సాగే పల్లవితో ఈ పాట ఉంది. విషయం ఏమిటంటే బాలు జీవించి ఉండగానే ఈ పాట రికార్డింగ్ జరిగింది. వివేక రాసిన ఈ పాటను బాలు పాడారు. తమిళ్ పాట మాత్రమే ఈరోజు విడుదలైంది.
ఈరోజు సాయంత్ర 6 గంటలకు ఈ పాటను విడుదల చేశారు. రజినీ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగానే పాట ఉంది. ఇందులో రజినీ గెటప్ కూడా అలాగే ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో రజినీ చెల్లెల్లిగా నటించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అభిమన్యుసింగ్, సూరి తదితరులు కూడా ఉన్నారు. పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెండు గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది. బాలు పాడిన చివరి పాట ఇదే. అయితే ఈ పాటను తెలుగులో కూడా బాలూనే పాడారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు పాట ఇంకా విడుదల కాలేదు. రజినీ చిత్రాల్లో వచ్చే టైటిల్ సాంగ్స్ అన్నిటినీ బాలూనే పాడుతుంటారు. ఇందులో కూడా ఇది టైటిల్ సాంగే. మొత్తానికి బాలు గళాన్ని చాలా కాలం తర్వాత జనం వింటున్నారు. బాలు చివరి పాట కావడంతో దీని మీద అమాంతం క్రేజ్ ఏర్పడింది.
Must Read ;- ట్రిపుల్ ఆర్ విడుదల జనవరి 7న