ఎమ్మెల్యే అనగానే ఎప్పుడూ అనుచరగణం.. కార్యకర్తల సందడి.. కాన్వాయ్ ఇవే గుర్తొస్తాయి. కానీ పశ్చిమ గోదావరికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే అనగానే.. ఓ సామన్యమైన వ్యక్తి.. ప్రజల్లో కలిసిపోయే నేతగా గుర్తుంటారు. చేయూత అందించాల్సిన అధికార పార్టీ విఫలమవుతుంటే.. మాత్రం తానే ఒక్కడై సైన్యమై కరోనాపై పోరు బిగికరోనా కష్టకాలంలోస్తున్నాడు. తన నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతూ ప్రజలఎమ్మెల్యే రామానాయుడుకు కావాల్సిన నిత్యవసరాలు పంపిణ చేస్తున్నాడు. మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను పంపిణీ చేస్తూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. లాక్ డౌన్ అందరూ మిగతా నేతలంతా ఇంటికే పరిమితమైతే.. రామానాయుడు మాత్రం సైకిల్ మీద ప్రయాణిస్తూ తనవంతుగా సాయం చేస్తున్నాడు.
Must Read ;- చంద్రబాబు వల్లే మా ప్రాణాలు దక్కాయి : టీడీపీ హెల్ప్ లైన్ తో కోలుకున్న కరోనా బాధితులు

ప్రజా సేవకుడు
రామానాయుడు సమీక్షలు, చర్చలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. సమస్యల సాధన కోసం క్షేత్రస్థాయిలో పర్యటించడం అలవాటు. ఎమ్మెల్యే ఎన్నికైన నాటి నుంచి ఎన్నో సమస్యలపై ఆయన పోరాడాడు. గతంలో ఈయన కూలీ అవతారమెత్తి, కూలీల సమస్యలను పరిష్కరించేలా చేశారు. సమస్యలు ఎక్కడ ఉంటే.. అక్కడ ప్రత్యక్షమవుతూ ప్రజలకు అండగా నిలుస్తారు. ఏపీలో కరోనా విరుచుకుపడుతుండటంతో ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్ యాత్రకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆయన పాలకొల్లు మండలం అరట్లకట్ట, వెంకటాపురం గ్రామాలలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర నిర్వహించారు. పడకలు, ఆక్సిజన్ కావాలనే నినాదంతో 24 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేశారు. తాజాగా ఆయన యలమంచిలి మండలం బాడవ గ్రామానికి 32 కి.మీ సైకిల్ యాత్ర చేశారు. కోవిడ్ బాధితులకు నిత్యావసరాలు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.

ప్రజలకు కనీస వసతలు కల్పించాలి
రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ రాజకీయాలపై ఫోకస్ చేయకుండా కోవిడ్‌పై పెడితే బాగుంటుందని అన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లికి పరిమితమయ్యాడని అన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చూడాలన్నారు.
Must Read ;- టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్











