నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి… పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కొనసాగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయానా తమ్ముడు. అన్న యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండగా.. తెర వెనుకే ఉండి మొత్తం మంత్రాంగం నడిపిన కిశోర్… ఎప్పుడైతే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయి, కిరణ్ డమ్మీ అయిపోయారో, అప్పుడే తెర ముందుకు వచ్చేశారు. అంతేకాదండోయ్.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని తన సొంత కేడర్ కు తానున్నానంటూ గట్టి భరోసా ఇవ్వడంలోనూ కిశోర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
సోమవారం నాడు పీలేరు పరిధిలోని కలకడ మండల కేంద్రం నుంచి నల్లారి వారి సొంతూరు నగరిపల్లె మధ్య ఉన్న రోడ్డు మొత్తం వాహన శ్రేణితో బ్లాకైపోయిన తీరు చూస్తే… ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు చాలా ముందుగానే టీడీపీలో చేరిపోయిన కిశోర్.. పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తున్నారు. సొంత ఇమేజీని ఎక్స్ పోజ్ చేసుకునే విషయంలో అంతగా ఇష్టం లేని కిశోర్ పార్టీలో నిబద్ధత కలిగిన నేతగా సాగుతూ వస్తున్నారు. కిశోర్ లోని ఈ లక్షణాన్ని గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొన్నటి పార్టీ పునర్వవస్థీకరణలో భాగంగా కిశోర్‌కు ఏకంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. నిబద్ధతతో పనిచేసే నేతలకు, కార్యకర్తలకు టీడీపీ వెన్నుదన్నుగా నిలవడంతో పాటుగా వారి సేవలకు గుర్తింపుగా కీలక పదవులను కూడా ఇస్తుందన్న మాటను మరోమారు చంద్రబాబు నిరూపించారు. పార్టీలో కీలక పదవి దక్కిన తర్వాత సోమవారం నల్లారి కిశోర్ తన స్వగ్రామం నగరి పల్లెకు వచ్చారు.
టీడీపీలో కీలక పదవిని దక్కించుకుని నల్లాకి కిశోర్ కుమార్ రెడ్డి స్వగ్రామానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. ఈ క్రమంలో ఏకంగా 1500 వాహనాలు కలకడకు చేరుకున్నారు. 1,500 వాహనాలు, వాటి నిండా పార్టీ కార్యకర్తలు మొత్తంగా ఓ కోలాహల వాతావరనం నెలకొంది. కిశోర్ కలకడలో అడుగుపెట్టగానే… కార్యకర్తలంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసిన కిశోర్… కారు దిరి వారితో పాటు కొంతదూరం నడిచారు. ఈ క్రమంలో ఒకేసారి 1,500 వాహనాలతో కిశోర్ కు స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు రాగా… కలకడ, నగరిపల్లె మధ్య రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది.
Also Read ;- పెదవులతో పలకరింపు.. కనులతో వెక్కిరింపు టీడీపీలో కొందరు సీనియర్ల తీరు