రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను సాక్షి పత్రిక అవమానించిందని, యాజమాన్యం దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14నాడు అంబేద్కర్ జయంతి సందర్భగా సాక్షిలో ప్రచురించిన ఫోటో అవమానపరిచేదిగా ఉందని ఆయన మీడియాకు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం దళితులపై కక్ష కట్టిందని హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి తాను సాక్షిపత్రిక చదవనని, ఎస్సీలు ఎవరూ ఆ పత్రికను చదవ వద్దని పిలుపునిచ్చారు. సాక్షి టీవీ ఎలాంటిదో సాక్షాత్తూ ముఖ్యమంత్రి సోదరి షర్మిల వెల్లడించారని హర్షకుమార్ గుర్తు చేశారు.
జడ్జి రామకృష్ణ అరెస్టును ఖండిస్తున్నాం..
జడ్జి రామకృష్ణను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేయడం దారుణమని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. పోలీసులు జడ్జి రామకృష్ణ మెడపట్టి జీపులోనికి నెట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సస్పెండైన జడ్జి రామకృష్ణ ఓ టీవీ డిబేట్లో మాట్లాడిన దాంట్లో అంత నేరమేముందో అర్థం కావడం లేదని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. దళితులంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని, డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారనుకుంటున్నారని హర్షకుమార్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దళితులు వైసీపీకి ఓటు వేయవద్దని ఆయన సూచించారు.
Also Read: సాక్షిలో విజయమ్మ, షర్మిల మాత్రమే.. డా.సునీత కనిపించలేదా?











