సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తె షూటింగ్ సమయంలో కరోనా కారణంగా అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హైదరాబాద్లోని అపోలో హాస్పటల్ లో జాయిన్ కావడం ఆ తర్వాత చెన్నై హాస్పటల్ లో జాయిన్ కావడం జరిగింది. వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోవడం వలన కరోనా నుంచి బయటపడడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీలో దాదాసాహెబ్ పురస్కారం అందుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రజినీకాంత్ హాస్పటల్ లో జాయిన్ చేశారు.
కుటుంబ సభ్యులు రెగ్యులర్ చెకప్ కోసమే అని చెబుతున్నప్పటికీ.. కాస్త సీరియస్ గా ఉందనే వార్త బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి రజనీకాంత్ అభిమానులలో ఆందోళన మొదలైంది. హాస్పటల్ కి రజనీకాంత్ అభిమానులు పోనులు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా కావేరి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇంతకీ డాక్టర్లు ఏం చెప్పారంటే.. రజనీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తించినట్టు తెలిపారు.
ఆ బ్లాక్స్‌ని తొలగిస్తున్నట్టుగా వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ కు రెస్పాండ్ అవుతున్నారు. ఎక్స్ పర్ట్స్ అయిన డాక్టర్ల సమక్షంలో ట్రీట్ మెంట్ జరుగుతోంది. త్వరలోనే రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేస్తామని ఓ బులెటిన్ ద్వారా తెలియచేశారు. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ నటించిన అన్నాత్తె మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Must Read ;- రజినీ ఆరోగ్యంపై అనేక అనుమానాలు?











