2020లో ప్రపంచమంతంటికి ఒకటే కల. అదే కొవిడ్-19 ని తరిమికొట్టే వ్యాక్సిన్. ఎప్పుడెప్పుడా అని వేచిచూసిన రోజు చాలా దగ్గర్లో ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభత్వాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. రాబోతున్న కొత్త సంవత్సరంలో వ్యాక్సినేషన్ అందించడానికి సన్నహాలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జనవరిలో మొదలైన తొలివిడత జులై వరకు కొనసాగుతుందని, ఈ తొలి విడతలో 25-30 కోట్ల మందికి టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
కేంద్రం మార్గదర్శకాలు
- వ్యాక్సినేషన్ ముందుగా డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు అందించాలి.
- ఇక సామాన్య ప్రజల విషయానికొస్తే, వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘కో-విన్’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వయస్సును ఓటరు జాబిత ఆధారంగా గుర్తించి ముందుగా 60 ఏళ్ల పైబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆపై 50 ఏళ్ల వాళ్లని ఎంపిక చేయాలి.
- వ్యాక్సినేషన్ బృందంలో వ్యాక్సినేటర్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ఆగ్జిలరీ నర్స్ లేడీ హెల్త్ విజిటర్‌లు, సహాయకులిగా పోలీస్ వారు కూడా ఉండేలా జాగ్రత్త వహించాలి.
- ఇక వ్యాక్సినేషన్ విధానం గురించి చూస్తే, ఒక్కో కేంద్రంలో వంద నుండి రెండు వందల మంది వరకు వ్యాక్సిన్ ఇవ్వగలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
- వ్యాక్సిన్ ఇవ్వడంతో సరిపోదు, టీకా తీసుకున్న వారి ఆరోగ్యాన్న ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి టీకా సామర్థ్యాన్ని ఒక డేటా తయారుచేయాలి.

Must Read ;- అమెరికాలో ఫైజర్‌కు లైన్ క్లియర్
తెలంగాణలో శిక్షణ
కొవిడ్ టీకా అందించే సన్నహాల్లో భాగంగా ముందుగా శిక్షణ అవసరం. శిక్షణ లేమి వల్ల చాలా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. తొలి రోజు శిక్షణలో భాగంగా జిల్లా కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. మొదటి రోజు శిక్షణ అందించడానికి ప్రపంచారోగ్య సంస్థ యునిసెఫ్ ప్రతినిధులు పాల్గొంటారు. సోమవారం శిక్షణ అనంతరం, మంగళవారం రోజున వారి పనితీరు గమనించనున్నారు. టీకా ఎలా ఇవ్వాలి, వాటిని ఎలా స్టోర్ చేయాలి, వ్యార్ధాలని ఎలా మేనేజ్ చేయాలి.. ఇలాంటి విషయాలపై శిక్షణ అందించనున్నారు. ఆపై మండల స్థాయిలో కూడా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కోటి టీకాలకు ఏర్పాట్లు
కేంద్రం నుండి వ్యాక్సిన్ అందగానే ఒక్క నెలలో కోటిమందికి అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ, కేంద్రం టీకా సరఫరా స్పష్టత లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ సన్నాహాలతో సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా, 4,762 కేంద్రాలు సిద్దం చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 100 మందికి వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కో కేంద్రంలో 70 మందికి వేసినా కూడా నెలకి కోటి మందికి వేయచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కేంద్రం ఎంతమేర సరఫరా చేయబోతుందనేది తెలియరావాలి. వ్యాక్సిన్ వేసేందుకు 9,724 మంది వ్యాక్సినేటర్లు నిరంతరాయంగా పనిచేస్తారు.
Also Read ;- కొవిడ్ తీవ్రతకు కారణమైన జీన్స్ చికిత్సకు తోడ్పడుతాయట!
వేస్తున్నారు. తొలిదశ టీకాను నెలరోజుల్లో పూర్తిచేసేందుకు మౌలిక వసతులు సమకూరుస్తున్నారు. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు 3,66,442 మందికి టీకా వేస్తారు. ఆపై పోలీసులు, శానిటేషన్ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తుంది ప్రభుత్వం. తొలిదశలో టీకా వేసిన వారికి రెండోదశలో ఆరునెలల తర్వాత రెండోడోసు వేస్తారు.
అక్టోబర్ నాటికి పూర్వ స్థితులు వస్తాయి
ఆక్స్ ఫర్డ్–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. తొలిదశలో దేశంలో దాదాపు 20 శాతం టీకా అందించడం అనివార్యమని, అందువల్ల కేసులు అదుపులోకి రావడంతోపాటు, కరోనా వ్యాప్తి తగ్గుతుందనే అంచనా చెప్పుకొచ్చారు. అంచనా ప్రకారం జనవరిలో మొదలుపెడితే, అక్టోబర్ నాటికి మళ్లీ కరోనా ముందు నాటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నయని చెప్పారు. ఈ నెలాఖరులోగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి సంబంధించి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు.
Also Read ;- ఫైజర్ మరో ముందడుగు.. భారత్ బయోటెక్ వైపే అందరి చూపు..