రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న యాక్షన్ అండ్ స్పోర్ట్ డ్రామా ‘లైగర్’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ లో ఈ సినిమాను కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.
ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్ , బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందాడు. సరికొత్త మేకోవర్ తో విజయ్ తెరమీద కనిపించనున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
పలు జాకీచాన్ చిత్రాలతో పాటు, వివిధ హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు ఆండీ లాంగ్. ఆయన నేతృత్వంలో ఇటీవల కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు . ప్రపంచంలోని వివిధ దేశాల్నుంచి వచ్చిన ఆండీ టీమ్ .. ఈ సన్నివేశాల్లో పాల్గొంది. ముంబై లో ఈ సినమా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారు. మరో కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న లైగర్ సినిమా విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- లైగర్ రిలీజ్ డేట్ ఖరారు
Hollywood Stunt Choreographer #AndyLong & Team,who worked for JackieChan and many other Hollywood films, is roped in for #LIGER
High-voltage actioner on track!#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/l4avW7Hd43
— Charmme Kaur (@Charmmeofficial) April 6, 2021