టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ . డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఎమోషన్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. చార్మీ సహాయ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా శివగామి రమ్యకృష్ణ నటిస్తుండడం విశేషం. ఆ పాత్ర సినిమాకే హైలైట్ కాబోతోందని టాక్స్ వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా రమ్యకృష్ణ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో విజయ్ దేవరకొండ తో దిగిన ఫోటో ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఒక మంచి సంస్థలో విజయ్ దేవరకొండతో నటిస్తోంటో పార్టీ మోడ్ లో ఉన్నట్టు ఫీలవుతున్నానని కోట్ చేస్తూ రమ్యకృష్ణ తన భుజం మీద చెయ్యి వేసి నవ్వుతోన్న విజయ్ ఫోటో ను షేర్ చేసింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అనన్యపాండే కథానాయికగా నటిస్తోన్న లైగర్ సినిమా విజయ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- లైగర్ రిలీజ్ డేట్ ఖరారు