How Jagan And Co Takes Care Of The Roads While Traveling In Private Jets :
పై ఫొటో చూశారా?.. అందులోని తొలి ఫొటోలోనే చార్టెర్డ్ ఫ్లైట్ లో విలాసంగా కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఆయనను గుర్తు పట్టారా? ఆయన ఏపీ సీఎం జగన్ మామ గారు. అంతేకాదు.. జగన్ కేబినెట్ లో ఏరికోరి మరీ గనుల శాఖను దక్కించుకున్న మంత్రివర్యులు కూడా.ఇక ఆ తర్వాత ఫొటోల్లో ఉన్న వాళ్లంగా తెలుసు కదా. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్ సభ సభ్యులు నందిగం సురేశ్, మార్గాని భరత్ రామ్, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, బాలశౌరి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి.. ఆ తర్వాత చార్టెర్డ్ ఫ్లైట్ లో విలాసంగా జర్నీ చేసి దిగుతున్న మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి.. వీరితో పాటు ఇంకా చాలా మందే కనిపిస్తున్నారు గానీ.. వారు అధికారులతో, జగన్ మిత్రులో తెలియడం లేదు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధుల మిత్రులు, వ్యాపార భాగస్వాములు.. ఇలా అంతా జల్సా చేసేవారే. జల్సా చేస్తే తప్పేమిటీ? అంటారా? జేలులోని పైసలు ఖర్చు పెట్టి జల్సా చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. అదే జల్సాను ప్రజల సొమ్ముతో చేస్తేనే తప్పు. ఇక్కడ జరుగుతోంది కూడా అదే.
అప్పుల కుప్ప పెరుగుతున్నా..?
ఓ వైపు రాష్ట్ర ఆదాయం అంతకంతకూ తరిగిపోతోందని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల కోసం కూడా సరిపడినంత నిధులు లేవని జగన్ సర్కారు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకే విధి లేని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని కూడా జగన్ అండ్ కో చెబుతోంది. ఆదాయం లేకపోతే.. లగ్జరీ బస్సు ఎక్కుతామా? ఆర్డినరీ బస్సులోనే వెళతామా? ఈ తరహా పట్టింపులేమీ జగన్ సర్కారుకు లేవు. రాష్ట్రం ఏమైపోయినా.. అధికారంలోకి వచ్చాం కదా.. ప్రజల సొమ్ముతో జల్సా చేయాల్సిందే కదా అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం. ఏ చిన్న కార్యక్రమానికైనా చార్టెర్డ్ ఫ్లైట్ వాడుతున్న జగన్.. తనతో పాటు తన మంత్రివర్గ సభ్యులకు కూడా ఆ జల్సాను అందిస్తున్నారు. మొన్న తన తండ్రి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లేందుకు గన్నవరం నుంచి కడపకు చార్టెర్డ్ ఫ్లైట్ లో వెళ్లిన జగన్ దంపతులు.. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వెళ్లారు. ఈ ఖర్చు మొత్తం సర్కారీ ఖజానా నుంచే. అదే అమరావతి నుంచి హెలికాప్టర్ లో వెళితే.. కొంతలో కొంతైనా ఆదా జరిగేది కాదా. ఈ తరహా ఆదా గురించి ఆలోచించే నాథులు జగన్ కోటరీలో ఎవరూ లేరని పై ఫొటోలు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది కదా.
రోడ్ల దుస్థితి వీరికెలా తెలిసేది?
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక.. కొత్తగా రోడ్లు వేయడం మాట అటుంచితే.. వర్షాలకు పాడైపోయిన రోడ్లకు కనీస మరమ్మతులు కూడా జరగడం లేదు. రెండున్నరేళ్లుగా మరమ్మతులు లేని కారణంగా రాష్ట్రంలో రోడ్లు ఎంతగా పాడైపోయాయో.. ఇటీవలి నిరసనల్లో టీడీపీ నేతలు కళ్లకు కట్టినట్టుగా చూపారు. తాజాగా జనసేన నేతలు కూడా ఏకంగా ఆ రోడ్ల దుస్థితిని ప్రజలందరికీ తెలిసేలా ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తున్నారు. సరే.. రోడ్లు బాగా లేవు. మరి ఆ రోడ్ల దుస్థితి ప్రభుత్వ పెద్దలకు తెలిసేదెలా? అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అసలు కార్లలో వెళితే కదా.. రోడ్ల దుస్థితి ఏమిటో వారికి తెలిసేది? నిజమే.. నిత్యం చార్టెర్డ్ ఫ్లైట్లలో చక్కర్లు కొట్టే వీరికి అధ్వాన్నంగా తయారైన రోడ్ల దుస్థితి తెలియదు కదా. అందకే కాబోలు చార్టెర్డ్ ఫ్లైట్లలో తమ విలాసవంతమైన జర్నీ తరహాలోనే రోడ్లూ కూడా ఉన్నాయనే వీరు భావిస్తున్నారేమో. అందుకే జగన్ సర్కారు రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులకు పూనుకోలేదట. ఈ దిశగా జగన్ సర్కారుపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- అప్పులకు జగన్ చెప్పిన కారణాలివే











