సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫైటర్ టైటిల్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. ఇంకా టైటిల్ కన్ ఫర్మ్ చేయలేదు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సంవత్సరంలో దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా బ్రేక్ పడింది. కరోనా తగ్గడంతో షూటింగులు స్టార్ట్ అయ్యాయి. అయితే.. స్పీడుగా సినిమాలు తీసే పూరి ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పటి వరకు ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది అనుకున్నారు కానీ… కరోనా కారణంగా కాదు.. కరెన్సీ లేక ఆగింది అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. అదేంటి.. ఈ సినిమా ఫైనాన్ష్ ప్రాబ్లమ్ ఏంటి.? విజయ్ దేవరకొండ హీరో.. ఫామ్ లోకి వచ్చిన పూరి డైరెక్టర్.. పైగా ఇది పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా పార్టనర్. అలాంటప్పుడు ఫైనాన్ష్ ప్రాబ్లమ్ వలన ఆగడం ఏంటి అనుకోవచ్చు. అయితే.. ఫైనాన్స్ ప్రాబ్లమ్ వలనే ఈ సినిమా ఆగిందని గట్టిగా వినిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనుకున్నారు కానీ.. ఎలాంటి అప్ డేట్ రాలేదు.
దీంతో ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమేనా.? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఫైనాన్స్ ప్రాబ్లమ్ వలన ఈ సినిమా ఆగిందని జోరుగా వార్తలు రావడంతో అసలు కారణం ఇదేనా.? అని ఆరా తీస్తే.. అలాంటిది ఏమీ లేదు. విదేశాల్లో షూటింగ్ చేయాల్సివుంది. అక్కడ కరోనా ఇంకా తగ్గలేదు. అందుచేత ఆగింది కానీ.. ప్రచారంలో ఉన్నట్టు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని పూరి టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖచ్చితంగా జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అంటున్నారు.
అంతా అనుకున్నట్టు జరిగి జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళితే.. ఎలాంటి ప్రాబ్లమ్ లేనట్టే. అలా కాకుండా జనవరి నుంచి కూడా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోతే ప్రచారంలో ఉన్నది వాస్తవమే అనుకోవాలి. ఏది ఏమైనా.. అడ్డంకులను దాటుకుని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాలని.. విజయ్ – పూరి కాంబో సెన్సేషన్ క్రియేట్ చేయాలని కోరుకుందాం.
Must Read ;- విజయ్ సేతుపతి విరుగుడులేని విలనిజం
https://www.youtube.com/watch?v=ddM64HD5itE











