గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్, జస్టిస్ గోస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన సీజే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్ మహేశ్వరి సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో గోస్వామిని నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
రాజధాని కేసులే కీలకం
అమరావతి హైకోర్టులో రాజధాని కేసుల విచారణ కీలక దశకు చేరుకున్నాయి. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ 93 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నింటిని కలిపి విచారణ చేస్తున్నారు. ఈ కేసులపై రోజువారీ విచారణ ప్రారంభించడంతో రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ సమయంలో హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియామకం చర్చ నీయాంశంగా మారింది.
Must Read ;- ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలింపు











