మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే మా అధ్యక్షుడుగా పోటీ చేస్తానని ప్రకటించారో అప్పటి నుంచి నాన్ లోకల్ అనేది తెర పైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని.. మా ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదు అని కొంత మంది సినీ నటులు అనడంతో వివాదం మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. అన్నయ్య చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కి ఉందని చెప్పడం జరిగింది. ప్రకాష్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు పోటీ చేయనున్నట్టుగా ఓ లేఖ విడుదల చేశాడు.
ఆ లేఖలో మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం అంటూ ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు.. ఇలా మా అధ్యక్ష పదవి కోసం పోటీ పెరుగుతుండడం.. ఇంకా మా ఎన్నికలకు మూడు నెలల టైమ్ ఉండడంతో ఏం జరగనుందో అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. సీనియర్ హీరో సుమన్ ఈ వివాదం గురించి స్పందిస్తూ… దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్ కిందే లెక్కని.. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు.
అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని ఆయన తెలిపారు. ఈ విధంగా.. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన మా ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. దీంతో, ఈ ఏడాది మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- మా ఎన్నికలపై కోట ఆగ్రహం.. ముదురుతున్న వివాదం