టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ .. పెళ్ళి తర్వాత సినిమాల పరంగా స్పీడ్ చూపిస్తోంది. క్రేజీ ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ.. సత్తా చాటుకుంటోంది. మంచు విష్ణుతో మోసగాళ్ళు సినిమా చేసిన కాజల్ .. మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య , కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాల్ని చేస్తోంది. తాజాగా ఇప్పుడు అక్కినేని నాగార్జునతో ఒక క్రేజీ మూవీకి కమిట్ అయింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి.
‘గరుడవేగ’ తో మంచి హిట్టందుకున్న ప్రవీణ్ సత్తారు.. ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేసి.. మళ్ళీ అంతటి స్థాయిలోనే మరో థ్రిల్లర్ కథను రాసుకున్నాడు. దీనికి నాగార్జున హీరో అయితే బాగుంటుందని ఫిక్సయి.. ఈ కథతో నాగ్ ను ఒప్పించాడు. నాగార్జునకి కథ బాగా నచ్చి.. వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇందులో కథానాయికగా కాజల్ ను ఎంపికచేసిన ప్రవీణ్.. ఆమెను ఇందులో రా ఏజెంట్ గా చూపించబోతుండడం విశేషంగా మాదింది. గతంలో కాజల్ ఈ తరహా పాత్రలు చేయకపోవడంతో .. ఆ పాత్రమీద అందరికీ ఆసక్తి కలుగుతోంది. అతి త్వరలోనే సినిమా లాంచ్ కాబోతోంది.
Must Read ;- కాజల్ తో మారుతి.. సినిమానా? వెబ్ సిరీసా?