అవినీతి నిర్మూలనకు ఓ ముఖ్యమంత్రి నడుంకడితే ఏం జరుగుతుందో మనం చాలా సినిమాల్లో చూశాం. కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తూ ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేశారు. ఆ సినిమా పేరే ‘వన్’. నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏప్రిల్ 27 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మమ్ముట్టి ముఖ్యమంత్రిగా నటించడం ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో చేశారు. ఈ సినిమా గత మార్చి నెలలో కేరళలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకుముందు ‘ది ప్రీస్ట్’ అనే హారర్ సినిమాలో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా అమెజాన్ లో విడుదలైంది.
ఓ సీఎం నిజాయితీగా ఉండదలుచుకుంటే ఇంటా బయటా అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మీద డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ బాగోలేదన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఈ కథ వినగానే అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’, అనిల్ కపూర్ ‘నాయక్’ చిత్రాలు గుర్తొస్తాయి. ఓ సాధారణ వ్యక్తి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఏంచేశాడు అన్నదే ఆ సినిమా కథ. ఈ రెండు కథల్లోనూ కొంత పోలిక ఉంటుంది.
ఇద్దరూ నిజాయితీ గల ముఖ్యమంత్రులే. ఇద్దరూ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తారు. ఒకే ఒక్కడు మంచి విజయాన్ని సాధించింది. కానీ ఈ సినిమాకి అంత సీన్ కనిపించేలా లేదు. ముఖ్యంగా ఒకేఒక్కడులోగాని, నాయక్ లోగాని బలమైన విలన్ కనిపిస్తాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగా పండుతుంది. కానీ హిందీ నాయక్ మాత్రం జనాదరణను సాధించలేకపోయింది. సరైన ప్రమోషన్ లేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు. ‘వన్ ’ సినిమాలో మమ్ముట్టి నటన ప్రధాన ఆకర్షణ అవుతుంది. కానీ సక్సెస్ పరంగా మాత్రం వెనకబడే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సినిమా చూడాలనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని చూడొచ్చు.
Must Read ;- అమెజాన్ ప్రైమ్ లో థ్రిల్ చేస్తున్న మమ్ముట్టి చిత్రం ‘ది ప్రీస్ట్’











