మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి .. రీసెంట్ గా ఒకేసారి రెండు సినిమాలతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. అందులో ఒకటి పొలిటికల్ థ్రిల్లర్ ఒన్ అయితే.. మరొకటి హారర్ థ్రిల్లర్ ది ప్రీస్ట్. రెండు సినిమాల్లోనూ ఒక దానికొకటి సంబంధం లేని పాత్రలు విభిన్నమైన పాత్రలు పోషించారు. వాటిలో ది ప్రీస్ట్ లో చేసిన ఫాదర్ బెనెడిక్ట్ అనే సైకియాట్రిస్ట్ కేరక్టర్. ఆయన కెరీర్ లోనే వేయని ఒక వెరైటీ తో ఈ సినిమాలో కనిపిస్తారు మమ్ముట్టి.
ఓ గ్రామంలో పేరున్న ధనిక కుటుంబీకులు .. ఒకొక్కరు ఆత్మ హత్య చేసుకుంటారు. దానికి కారణం ఏంటో తెలియదు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసాఫర్ కు ఓ చర్చ్ ఫాదర్ సాయపతాడు. ఆయన ఇంటెలిజెన్సీతో కేసు ఈజీగానే సాల్వ్ అవుతుంది. దానికి కారణమైన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే అక్కడి నుంచే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ప్రీస్ట్ కు కొత్త సమస్య మొదలవుతుంది. ఇంతకీ ఏంటా సమస్య? అన్న విషయం తెలియాలంటే… ‘ది ప్రీస్ట్’ మూవీ చూడాల్సిందే.
మలయాళంలో ఈ సినిమా మార్చ్ 11న విడుదలై… సూపర్ హిట్టైంది. మెగాస్టార్ మమ్ముట్టి, నిఖిలా విమల్, మంజూ వారియర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ మార్కులు వేయించుకుంటుంది అమేయా గాబ్రియేల్ అనే ఓ పాప. అమేయ గా నటించిన ఈ అమ్మాయి అదరగొట్టేసింది. సినిమా కథకి ఆ అమ్మాయి పాత్రే ఆధారం. అమెజాన్ ప్రైమ్ లో నిన్ననే విడుదలైన ఈ సినిమాని చూసి థ్రిల్ అవ్వండి…
Must Read ;- ‘సలార్’ మూవీకి అమెజాన్ ప్రైమ్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్