మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఆతర్వాత ఓటీటీ సంస్థల నుంచి ఈ మూవీకి భారీ ఆఫర్స్ వచ్చాయి. దీంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఈ మూవీ టీమ్ మాత్రం ఈ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేస్తామన్నారు.
ఈ మూవీ టీమ్ మెంబర్స్ చెప్పినట్టుగానే ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. లాక్ డౌన్ తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. దీనికి జనాల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. త్వరలో జరగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి రానున్నారు. ఈ సినిమాని ప్రమోషన్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. చిరు ఈ సినిమా గురించి ట్విట్టర్ లో స్పందించారు. ఇంతకీ.. చిరంజీవి ఏమన్నారంటే.. ఈ క్రిస్మస్ కి విడుదల అవుతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు.
లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న తొలి చిత్రంగా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలో ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. ఈ చిత్రాన్ని థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అని తెలియచేశారు.
Must Read ;- ఆచార్య సెట్‌లో మెగాస్టార్ ను కలిసిన కలెక్షన్ కింగ్
#StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020