తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్దికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించడం పట్ల మెగా స్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రాయితీలు సినీ పరిశ్రమకు ఎంతో ఊతమిస్తాయని, ఎన్నో కుటుంబాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయపడతాయని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా సినిమా థియేటర్ల మనుగడకు ముప్పువాటిల్లిన ఇలాంటి తరుణంలో ఈ చర్యలు ఎంతో ఊరటనిస్తాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో సినిమా నిర్మాణ సంస్థలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఆనందం వ్యక్తంచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు ఇందుకోసం ప్రయత్నించిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి లాంటి వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు ఎన్.వి ప్రసాద్, దిల్ రాజు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read: ఆహా రాజమౌళి.. తెలుగు సినిమా బాహుబలి