రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షడు ప్రణవ్‌గోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏయూ హైస్కూల్ వద్ద రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు అక్కడ పరిస్థితులను చూసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు 3వ పట్టణ పీఎస్‌కు తరలించారు. కాగా రిగ్గింగ్ జరగకుండా చూడాల్సిన అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పరిస్థితులను గమనించటానికి వెళ్లిన ఎమ్మెల్యే, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడులను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Must Read ;- ’ఉక్కు‘పై ప్రకటనతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు.. గ్రేటర్ విశాఖలో అంచనాలు తారుమారు?











