కేవలం పెర్ఫార్మెన్స్ తోనే ప్రేక్షకుల్ని మెప్పించాలనుకుంటారు మలయాళ బ్యూటీస్ . అందుకు తగ్గ రీతిలోనే కథల్ని ఎంపిక చేసుకుంటారు. తమ పెర్ఫార్మెన్స్ ను గ్లామర్ డామినేట్ చేయకుండా.. జాగ్రత్త పడతారు. ఇంతవరకూ టాలీవుడ్ లో ఫేమస్ అయిన మల్లూ బ్యూటీస్ అందరూ ఇదే పాట్రన్ ను ఫాలో అయ్యారు. ఇంకా అవుతునే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరిన మరో టాలెంటెడ్ బ్యూటీ నజ్రియా నజీమ్. తెలుగు తెరకు ఆమె కొత్తే కానీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే.
‘రాజు రాణి’ తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తొలిసారి గా పలకరించింది నజ్రియా నజీమ్. ఇప్పుడు ఆమె తెలుగులో డైరెక్ట్ గా హీరోయిన్ గా నటిస్తున్న తొలి చిత్రం నానీ హీరోగా నటిస్తోన్న అంటే .. సుందరానికీ. మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా సినిమాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో నానీ.. సుందరం అనే వినోదాత్మకమైన పాత్రను పోషించబోతున్నాడు. ఆ పాత్ర సినిమాకే హైలైట్ కాబోతోంది.
ఇక ‘అంటే సుందరానికీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్టు .. కథానాయిక నజ్రియా నజీమ్.. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలియచేసింది. ఈ రోజు నేను నా మొదటి తెలుగు సినిమా అంటే సుందరానికీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను. మొదటిది అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. అలాగే.. ఈ సినిమా కూడా నాకు ప్రత్యేకమైనదే అని పోస్ట్ పెట్టింది.
బాలనటిగా మాలీవుడ్ లో కి ప్రవేశించి.. ఆపై కథానాయికగా అడుగుపెట్టిన ఈ క్యూట్ బ్యూటీ.. విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ భార్య అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమాతో ఫహద్.. అంటే సుందరానికీ సినిమాతో నజ్రియా ఒకేసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం నిజంగా విశేషమే మరి. మరి నజ్రియా మొదటి సినిమాతో ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
Must Read ;- ‘జెర్సీ’ కాంబోలో మరో సినిమా?











