టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి డేట్లు కోసం బడా నిర్మాతలు పడిగాపులు గాస్తున్నారు. దర్శకులు అయితే వీళ్ళతో సినిమా చేస్తే హిట్ పక్కా అని భావిస్తున్నారు. వారు ఎవరో కాదు ఒకరు పూజా హెగ్డే, మరొకరు రష్మికా మందన్నా. ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలు కూడా కాజల్, తమన్నా, రకుల్ ను పక్కన పెట్టి వీరిద్దరినే ప్రిఫర్ చేస్తున్నారు.
ప్రస్తుతం పూజా అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు ఇంకో రెండు సినిమాలను లైన్ లో పెట్టిందని తెలుస్తోంది. ఇక రష్మిక విషయానికి వస్తే పూజా హెగ్డే కన్నా కాస్త ముందుందనే చెప్పాలి. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఘన విజయంతో ఆమె స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే శర్వానంద్ హీరోగా చేస్తున్న ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో కూడా నటిస్తోంది రష్మిక. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నది. ఇటీవల ఈ అమ్మడు మరో అరుదైన ఘనత కూడా సాధించింది. ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా గూగుల్ రష్మికను గుర్తించింది. ఈ ఘనత అందుకున్న అతికొంతమంది సౌత్ ఇండియన్ హీరోయిన్లలో రష్మిక కూడా నిలవడం గ్రేట్ అనే చెప్పాలి.
ఇక రష్మిక తమిళంలో కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో ‘సుల్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే తమిళ్ స్టార్ హీరో సూర్య – పాండిరాజ్ కలయికలో వస్తున్న సినిమాకు కూడా రష్మిక ఫైనల్ అయ్యింది. ఈ రెండు సినిమాలు కనుక హిట్ అయితే అక్కడ కూడా ఈ అమ్మడు హవా మొదలవుతుందనే చెప్పాలి. తెలుగు, తమిళ్ తో పాటు ఈమెకు కన్నడ పరిశ్రమ నుండి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే పూజా కూడా త్వరలోనే రెండు తమిళ్ సినిమాలలో మెరవనున్నదని సమాచారం. వీటితో పాటు పూజా హెగ్డేకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఈ విధంగా వీరిద్దరూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతూ నెంబర్ వన్ స్థానానికి పోటీపడుతున్నారు.
Must Read ;- మరో మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న తమిళ స్టార్ హీరో











