ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈడీ ఇచ్చిన నోటీసులపై శనివారం ఆయన స్పందించారు. తన బలం కేసీఆర్,ఖమ్మం ప్రజలే అని అన్నారు. గత 20 ఏళ్లుగా తాను ప్రజా జీవితంలో ఉన్నానని,40 ఏళ్ల క్రితమే మధుకాన్ స్థాపించానని, తమ కంపెనీలు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఏ కంపెనీలో డైరెక్టర్‌గా లేనన్నారు.
ఎస్పీవీ కంపెనీ బీవోటీ పద్ధతిలో రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు చేపట్టిందని, నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. ఎస్క్రో అకౌంట్‌పై బ్యాంకర్‌కే పూర్తి పవర్ ఉందని, విచారణకుకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. ట్రిబ్యునల్‌లో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. తాను డైరెక్టర్‌గా లేకపోయినా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మధుకాన్ కంపెనీ జార్ఖండ్‌లో రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Must Read ;- టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కార్యాలయాల్లో ఈడీ దాడులు











