తెలంగాణలో ఒక రోజు దీక్ష అనంతరం వైఎస్ షర్మిల చేపట్టిన యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో చోటుచేసుకున్న తోపులాటలో షర్మిల బట్టలు చింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై నరసాపురం వైసీపీ ఎంపీ ఘాటుగా స్పందించారు. అమరావతి మహిళా రైతుల బట్టలు చింపి, ఈడ్చుకుపోయి పోలీసులు వ్యానుల్లో ఎక్కించినప్పుడు విజయమ్మకు వారి బాధలు గుర్తుకు రాలేదా అని ఎంపీ రఘురామరాజు ప్రశ్నించారు. షర్మిలకు ఒక న్యాయం, అమరావతి మహిళా రైతులకు ఒక న్యాయమా అని రఘురామరాజు విజయమ్మను నిలదీశారు.
ఈ నెల 22న కేసు విచారణ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 22న విచారణకు రానుంది. సీఎంగా ఉంటూ సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని, జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ సీబీఐ న్యాయస్థానంలో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
Also Read:- జగన్ బెయిల్ రద్దు పిటిషిన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు