మనం సినిమా తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సమ్రాట్ నాగచైతన్యల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందుతోన్న బంగార్రాజు చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంటే.. నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది.
ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన లడ్డుండా.. పార్టీ సాంగ్స్ కు అనూహ్యమైన స్పందన లభించింది. అయితే.. బంగార్రాజు పండగలాంటి సినిమా అని.. సంక్రాంతికి విడుదల అని ప్రచారం జరుగుతుంది కానీ.. ఎప్పుడు విడుదల అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో బంగార్రాజు అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు బంగార్రాజు నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది.
అది ఏంటంటే.. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఉదయం 11.22 నిమిషాలకు బంగార్రాజు టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మరి.. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి.
Must Read ;- బంగార్రాజు.. వాసివాడి తస్సాదియ్యా పాట అదిరింది