సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర పోటీ మామూలుగా లేదు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ వస్తుంది. జవనరి 14న రాధేశ్యామ్ రాబోతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి కానుకగా జవనరి 12న వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. భీమ్లానాయక్ వస్తే.. అటు ఆర్ఆర్ఆర్, ఇటు రాధేశ్యామ్ ఇద్దరికీ భారీగా నష్టం. అలాగే తక్కువ థియేటర్లే దొరుకుతాయి కాబట్టి భీమ్లానాయక్ కూడా భారీగా నష్టమే.
అందుచేత భీమ్లా నాయక్ ని వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ భీమ్లా నాయక్ ని వాయిదా వేయడానికి రెడీగానే ఉన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పిన డేట్ కే రిలీజ్ చేద్దామంటున్నారట. అందుచేత ఇప్పుడు నిర్ణయం పవన్ చేతిలో ఉంది. ఇదిలా ఉంటే.. భీమ్లా నాయక్ సంక్రాంతికి రావడం వాయిదా పడితే.. బంగార్రాజు రిలీజ్ చేయాలనేది నాగార్జున ప్లాన్. అయితే.. ఇప్పుడు రాధేశ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బంగార్రాజును కూడా వాయిదా వేయించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి
తాజా సమాచారం ప్రకారం.. భీమ్లానాయక్ విడుదల వాయిదా పడడం ఖాయం అంటున్నారు. మరి.. బంగార్రాజు ఏం చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది. ఈవిధంగా సంక్రాంతి సినిమాల విషయం.
Must Read ;- బంగార్రాజులో రెండు ఐటం సాంగ్స్?











