టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమా ఓ సంచలనం. 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. సీనియర్ హీరోల్లో 50 కోట్లు కలెక్ట్ చేసిన తొలి హీరోగా ఓ రికార్డ్ ను కూడా అందించింది. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ కలసి చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనాతో అందరినీ మెప్పించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బంగార్రాజు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలు బరిలో ఉన్నప్పటికీ.. నాగార్జున తగ్గేదేలే అన్నట్టుగా బంగార్రాజుతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అవును.. ఈ సినిమా నుంచి అనూప్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను నవంబరు 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున సందడి చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.
అయితే.. ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు. నవంబరు 9న ఉదయం 9:09 గంటలకు బంగార్రాజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. పోస్టర్, ప్రోమోను గమనిస్తే.. ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ మీద ఇంతటి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే అనూప్ రూబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగార్రాజును కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్ల పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. మరి.. సోగ్గాడే చిన్ని నాయనా లాగా.. సంక్రాంతికి రానున్న బంగార్రాజు సరికొత్త రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి.
Must Read ;- బంగార్రాజు తాతా మనవళ్ల కథ