టాలీవుడ్ లో ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే అల్లరి నరేశ్ .. కొంత కాలంగా అందులో పూర్తిగా పట్టుకోల్పోయాడు. అందుకే మహేశ్ ‘మహర్షి’ మూవీలో కామెడీని పక్కన పెట్టి ఓ కీలక పాత్రతో మంచి మార్కులేయించుకున్నాడు. త్వరలో ‘నాంది’ అనే కోర్ట్ రూమ్ డ్రామాలో నగ్నంగా నటించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ప్రస్తుతం ఇలాంటి సినిమాలతో హాఫ్ బీట్ గా వస్తున్నప్పటికీ .. కామెడీ సినిమాల్ని పూర్తిగా పక్కన పెట్టలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘బంగారు బుల్లోడు’ గా ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీతో రాబోతున్నాడు. జనవరి 23న విడుదలవుతోన్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. అల్లరోడి ట్రేడ్ మార్క్ కామెడీతో నిండిపోయిన ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ట్రైలర్ ను బట్టి .. ‘బంగారు బుల్లోడు’ సినిమా గోల్డ్ లోన్స్ నేపథ్యంలో సాగే ఓ గోల్ మాల్ కథగా అర్ధమవుతోంది. బంగారు ఆభరణాలు తయారు చేసే అల్లరి నరేశ్ పాత్ర ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి. అలాంటి సంస్థలో బంగారు ఆభరణాల దొంగ తనం జరుగుతుంది. ఆ దొంగతనం ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనేదే మిగతా కథ. పోలీస్ ఆఫీసర్ గా అజయ్ ఘోష్ నటిస్తుండగా.. మిగతా పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, పృధ్విరాజ్, ప్రవీణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే.. అల్లరి నరేశ్ ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తాడనిపిస్తోంది. పి.గిరి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
Must Read ;- అల్లరోడు ‘బంగారు బుల్లోడు’ గా వచ్చేస్తున్నాడు











