తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవలి కాలంలో తనదైన శైలి దూకుడుతో సాగుతున్నారు. ఓ వైపు నేరుగా క్షేత్రస్థాయిలోకే దూకేసి పార్టీ కేడర్ కు అండగా నిలుస్తూనే, అన్యాయానికి గురైన ప్రజలకు భరోసా నింపుతూ సాగుతున్నారు. అదే సమయంలో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ట్విట్టర్ వేదికగా పార్టీ కేడర్ వాణిని వినేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటిదాకా ట్విట్టర్ స్పేసెస్ సెషన్ పేరిట జూన్ మాసంలో ఓ దఫా పార్టీ కేడర్ తో ముచ్చటించిన లోకేశ్.. ఇప్పుడు మరోమారు అదే వేదికగా శనివారం రాత్రి పార్టీ శ్రేణులతో మాట కలపనున్నారు. ఈ సెషన్ కు పార్టీ కేడర్ నుంచి ఊహించని రెస్పాన్స్ ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జూన్‌లో అదిరేటి రెస్పాన్స్
జూన్ నెలలో నిర్వహించిన ట్విట్టర్ స్పేసెస్ సెషన్ కు పార్టీ శ్రేణులు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ కు లోకేశ్ ఊహించిన దాని కంటే కూడా ఓ రేంజిలో పార్టీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సెషన్ లో పార్టీ కేడర్ చెప్పిన మాటలను చాలా ఆసక్తిగా విన్న లోకేశ్.. వాటిపై తనదైన శైలిలో ఫుల్ క్లారిటీతో స్పందించారు. తాజాగా శనివారం నిర్వహించనున్న సెషన్ కు దానిని మించిన రెస్పాన్స్ ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే.. జూన్ నాటి సెషన్ లో పార్టీ కేడర్ అబ్బురపడేలా వ్యవహరించిన లోకేశ్.. ఈ రెండు నెలల కాలంలో మరింతగా పరిణతి సాధించారు. జగన్ సర్కారును సెల్ఫ్ డిఫెన్స్ లోకి నెట్టేశారు. వెరసి తాజా సెషన్ కు పార్టీ కేడర్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఖాయమని చెప్పక తప్పదు.
అంశం ఏంటంటే..?
శనివారం రాత్రి నిర్వహించనున్న ట్విట్టర్ స్సేసెస్ సెషన్ లో ‘‘Why is Andhra Pradesh on the brink of a major economic, social, and financial disaster?(ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక, ఆర్థిక విపత్తు అంచున ఎందుకు ఉంది?)’’అన్న అంశపై లోకేశ్ పార్టీ కేడర్ తో చర్చిస్తారు. ఏపీని జగన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయేలా సాగుతోంది. ఇప్పటికే తాహతుకు మించి.. కేంద్రం మార్గదర్శకాలను ఉల్లంఘించి మరీ అప్పులు చేసిన జగన్ సర్కారు.. ఇకపైనా అప్పులు దొరక్కపోతే పాలనను సాగించలేని స్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడిదే బర్నింగ్ టాపిక్. ఈ టాపిక్ నే లోకేశ్ ట్విట్టర్ స్పేసెస్ సెషన్ అంశంగా ఎంచుకోవడం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- మేకతోటికి చిక్కులు జగన్ కు కలిసొచ్చినట్టే











