విక్టరీ వెంకటేష్ – సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ నారప్ప. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన అసురన్ మూవీకి రీమేక్ ఇది. ఇందులో వెంకీ సరసన ప్రియమణి నటిస్తుంది. వైవిధ్యభరితమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎప్పుడంటే.. మే 14న. అవును.. నారప్ప చిత్రాన్ని మే 14న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ యాక్షన్ మూవీని ఎలా తీస్తాడో అనుకున్నారు కానీ.. వెంకీ యాక్టింగ్, శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ సూపర్ అనేలా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మంచి సినిమా అందించాలని ఒకటికి రెండుసార్లు చూసుకుని ఎంతో జాగ్రత్తగా సినిమాని అందించే సురేష్ బాబు
ఈ మూవీ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారట. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. గురు, ఎఫ్ 2, వెంకీమామ.. ఇలా వరుస విజయాలతో జోరు మీదున్న వెంకీ నారప్పగా మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు. మరి.. తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసురన్ రీమేక్ నారప్ప గా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు మెప్సిస్తుందో చూడాలి.
Must Read ;- ‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎవరితో తెలుసా.?











