ప్రస్తుతం ‘మా’ అసోషియేషన్ లో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని నట సింహాం నందమూరి బాలకృష్ణ చేసిన వాఖ్యలు సినీవర్గాల్లో సంచలం రేపాయి. అంతేకాకుండా మంచు విష్ణు ‘మా’ భవనాన్ని తాను నిర్మిస్తానని చెప్పిన వాఖ్యలకు బాలకృష్ణ సపోర్ట్ చేయడంతో ‘మా’ అసోషియేన్ ఎలక్షన్ల గొడవ కాస్త బిల్డింగ్ వైపు మళ్లింది. అసలు ఇన్ని రోజులైనా ‘మా’ అసోసియేషన్ కోసం బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? బాలీవుడ్ తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు తీసేది ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే. అలాంటిది టాలీవుడ్ లో ఆర్టిస్టుల కోసం బిల్డింగ్ ఎందుకు లేదు? అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది.
అతి చిన్న సినిమా ఇండస్ట్రీ అయిన మలయాళం ఇండస్ట్రీ తమ సొంత డబ్బు దాదాపు పది కోట్లు వెచ్చించి సొంత భవనాన్ని కట్టుకుంది. అది కార్పొరేట్ సంస్థలను తలపించేదిగా ఉంది. ఎవరైనా హీరోలు కథలను వినాలనుకుంటే అక్కడే కూర్చొని వినవచ్చు. ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీలతో ఉండే ఆ భవనం చూసి ఇప్పుడు తెలుగులో కొంత మంది దీని మీద చర్చలు లేవనెత్తుతున్నారు. భవనం కోసం ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకోవలసిన అవసరం ఏముంది? ఇంత సంపాదిస్తున్న హీరోలు తలా ఒక చెయ్యి వేస్తే భవనం కట్టడం అంత కష్టమా? చిన్న సినిమా ఇండస్ట్రీ అయిన కేరళలోనే ఇది సాధ్యమైనప్పుడు మన దగ్గర సాధ్యం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది మన దగ్గర సాధ్యం కాక కాదు.. మనలో యూనిటీ లేదు అదే పెద్ద సమస్య అని మరికొందరు వ్యాఖ్యానించడం గమనార్హం.
Must Read ;- సొంత ఖర్చుతో ‘మా’ భవనం కడతానంటున్న విష్ణు