No Update Regarding Vijay Devarakonda And Shiva Nirvana Sensational Combination :
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. విజయ్ లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి తన ప్లాన్ మారిందని.. ఇక నుంచి వరుసగా పాన్ ఇండియా మూవీసే చేయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. లైగర్ తర్వాత శివ నిర్వాణతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారని.. కూడా టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతే కాకుండా… శివ నిర్వాణ చెప్పిన స్టోరీని పాన్ ఇండియా స్టోరీగా మార్చమన్నారని.. అయితే.. దానికి శివ నిర్వాణ ఒప్పుకోలేదు.
అందుకనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని కాస్త గట్టిగానే వినిపించింది. అయితే.. శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం టక్ జగదీష్. నాని హీరోగా తెరకెక్కించిన టక్ జగదీష్ చిత్రం ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన శివ నిర్వాణ విజయ్ దేవరకొండ సినిమా పై వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. విజయ్ దేవరకొండతో తన దర్శకత్వంలో సినిమా ఉందన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు శివ క్లారిటీ ఇచ్చాడు.
ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే.. లైగర్ ఎప్పుడు పూర్తైతే అప్పుడు విజయ్ తో తన సినిమా స్టార్ట్ అవుతుందని.. కథ రెడీగా ఉందని చెప్పారు. సో.. విజయ్ – శివ నిర్వాణ ప్రాజెక్ట్ ఆగిపోలేదు. ఖచ్చితంగా ఉంది. అయితే.. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది క్లారిటీ రావాల్సివుంది. అదీ.. సంగతి.
Must Read ;- టక్ జగదీష్ పై నాని ఏమన్నాడో తెలుసా?











