కరోనా మహమ్మారి… సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ఎవర్నీ వదలడం లేదు. దీనికి ఆడ, మగ, ఉన్నోడు లేనోడు.. ఇలా ఎలాంటి బేధాలు లేవు. ఈ మహమ్మారికి అందరూ సమానమే. అందుకే.. సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. టాలీవుడ్ లో రాజమౌళి, బండ్ల గణేష్, రామ్ చరణ్, వరుణ్ తేజ్… ఇలా చాలా మంది కరోనా బారిన పడిన వారే. ఇప్పుడు విదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దేశాధినేతలు హెచ్చరికలు జారీ చేశారు.
కరోనా బారిన పడి కొంత మంది సినీ ప్రముఖులు కోలుకుంటే.. కొంత మంది కన్నుమూశారు. అసలు విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, రేణుదేశాయ్ కరోనా బారినపడి.. ఆతర్వాత కోలుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్ లైవ్‌లో తెలియచేశారు. ఇంకా ఏం చెప్పారంటే.. కరోనా ఎక్కడా తగ్గలేదు. పరిస్థితులు అలానే ఉన్నాయి. అందుచేత అందరూ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.
అలాగే మనకు పండుగలు ముఖ్యమే.. కానీ అంతకన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుచేత ఎక్కువగా ఒక్క చోటే ఎక్కువ మంది ఉండడం వంటివి చేయద్దు అన్నారు. కరోనా సోకడంతో.. షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయ్యానని.. ఇప్పుడిప్పుడే షూటింగ్ లకు వెళుతున్నానని చెప్పారు. తను చేస్తున్న ప్రాజెక్ట్ ల గురించి చెబుతూ.. తను చేస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యింది. ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాను. దీని వివరాలను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఒక రైతుల మీదే తీయనున్న సినిమాను మార్చిలో ప్రారంభించనున్నట్టు చెప్పారు.
Must Read ;- మహేష్ మూవీలో నటించేది పవనా? రేణుదేశాయా?