June 30, 2026 1:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

జనం మెచ్చిన చిత్రాల జగమెరిగిన దర్శకుడు

కేవీ రెడ్డి.. ఈ పేరు చెబితే ఒక తరం పులకించి పోతుంది. నేటికీ ఆయన సినిమాలు ఆణిముత్యాలే. జూన్ 1 ఆయన 109వ జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం

July 1, 2021 at 3:18 PM
in Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక తరంలో హీరోలుగా ఎన్టీఆర్, ఏయన్నార్ లు తెలుగు సినిమా రంగానికి హీరోలుగా ఎలాగైతే రెండు కళ్లు అంటున్నారో అలాంటి రెండు దర్శకత్వ రంగంలోనూ ఉన్నాయి. వారిలో ఒకరు బీఎన్ రెడ్డి అయితే, ఇంకొకరు కె.వి. రెడ్డి.

బీఎన్ రెడ్డిది పూర్తిగా కళాత్మక దృష్టి. మనం తీసేదే జనం చూడాలంటారాయన. కె.వి. రెడ్డి అలాంటివారు కాదు. ఆయన సినిమా రంగంలో క్యాషియర్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. బాక్సాఫీసు కలెక్షన్లను ఎలా కొల్లగొట్టవచ్చో ఆయన నుంచి నేర్చుకోవచ్చు. అంటే వ్యాపారాత్మక కళాదృష్టి కేవీ రెడ్డిది. కళను కామర్స్ తో బ్యాలెన్స్ చేసి జనం కోరేదే మనం తీయాలంటారాయన. నాటి నుంచి నేటి వరకూ కేవీ రెడ్డి బాటలోనే ఎందరో దర్శకులు పయనిస్తున్నారు. అలాంటి కేవీ రెడ్డి 109వ జయంతి జూన్ 1. ఆయన పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి.

తెలుగు సినిమాకి ఊపు

తెలుగు సినిమా రంగానికి మెరుపు, ఓ ఊపు ఆయనే. ‘భక్తపోతన’, ‘పాతాళభైరవి’, ‘పెద్దమనుషులు’, ‘మాయాబజార్‌’, ‘దొంగరాముడు’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లాంటి సినిమాలను అన్ని తరాల వారూ ఆదిరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఆధునిక వివాహ వ్యవస్థ మీద ‘పెళ్లినాటి ప్రమాణాలు’ సినిమాని ఆరోజుల్లోనే తీశారు. ఆయనను చూస్తే ఖద్దరు పంచెకట్టుతో పల్లెటూరి పెద్ద మనిషిలా కనిపిస్తారు. ఈయనా ఇలాంటి సినిమాలు చేసింది అనిపిస్తుంది. ఆయన బి.ఎస్‌.సి (ఆనర్స్‌) చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

అనంతపురం జిల్లా, తాడిపత్రికి దగ్గరలో ఉన్న తేళ్ళమిట్టపల్లి ఆయన సొంతూరు. తండ్రి కొండారెడ్డి ఆ ఊరి మునసబు. నూట యాభై ఎకరాల భూస్వామి ఆయన. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఆ గ్రామంలో చదువుకున్న వ్యక్తి కొండారెడ్డి ఒక్కరే. ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుడు కె.వి.రెడ్డి. కె.వి.రెడ్డి తల్లిది తాడిపత్రి. అది కూడా సంపన్న కుటుంబమే. కేవీ రెడ్డి రెండేళ్ల వయసులోనే తండ్రి కొండారెడ్డి చనిపోయారు. దాంతో కె.వి. రెడ్డి తల్లితోపాటు తాడిపత్రిలోని తాతగారింటికి వచ్చేశారు. చదువుసంధ్యలన్నీ మేనమామ పర్యవేక్షణలో సాగాయి.

స్కూలు ఫైనల్‌ వరకు కె.వి. రెడ్డి తాడిపత్రిలోనే చదువుకున్నారు. స్కూల్లో కె.వి. రెడ్డికి ఉన్న ప్రాణ స్నేహితుడు ఎవరో కాదు.. మూలా నారాయణ స్వామి. వీరిద్దరి మనసుల్లోనూ సినిమా ఆలోచనే ఉండేవి. పదిహేనేళ్ల వయసులోనే సినిమా నిర్మాణం ఆలోచనలు చేశారు. పైచదువుల కోసం మకాం మద్రాసుకు మారిపోయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదవాలని కోరడంతో అక్కడే చేర్చారు. విక్టోరియా హాస్టల్‌లో కె.వి.రెడ్డి ఉండేవారు. ఇంగ్లీషు సినిమాలు చూడటం అక్కడే మొదలైంది. తనలోని సృజనాత్మకతను మెరుగుపర్చుకోడానికి అది ఉపయోగపడింది. అక్కడ ఆయనతో పాటు చదువకున్న వారంతా ప్రముఖులే.

సినిమాలపై మద్రాసులో మక్కువ

ప్రముఖ దర్శక నిర్మాత పి.పుల్లయ్య కాలేజిలో కె.వి.రెడ్డికి సీనియర్‌. ‘ఆంధ్ర మహిళా’ సంపాదకులు ఎ.వి.వి.కృష్ణారావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేబట్టిన పట్టాభి రామారావు లాంటివారు ఈయన క్లాస్ మేట్స్. పుల్లయ్యతో కలిసి స్టార్‌ కంబైన్స్‌ లాడ్జిలో కథా చర్చలు జరిపేవారు. అవే ఆ తర్వాత కాలంలో సినిమాలయ్యాయి. ఉద్యోగం దొరక్కపోవడంతో స్నేహితుడు ఎ.వి.వి.రెడ్డితో కలిసి ‘ది స్టాండర్డ్‌ సైంటిఫిక్‌ ఇన్స్ట్రుమెంట్స్‌ కంపెనీని ప్రారంభించారు. ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మూలా నారాయణ స్వామి ఆయనకు జిగిరీ దోస్త్ అని తెలుసుకదా.

రోహిణీ ఫిలిమ్స్‌ అనే సినిమా కంపెనీలో తాను పార్ట్ నర్ గా ఉన్నానని, ఇంట్రస్ట్ ఉంటే రావచ్చంటూ కేవీ రెడ్డిని కోరారు. ‘ఆరునెలలు వెళ్లి చూసి లాభాదాయకం అనిపిస్తే సినిమా రంగంలో ఉండు. లేకుంటే మన కంపెనీ ఉంది కదా’ అంటూ ఏవీవీ రెడ్డి సలహా ఇచ్చారు. చివరకు కేవీ రెడ్డి అడుగులు రోహిణీ ఫిలిమ్స్ వైపు పడ్డాయి. హెచ్‌.ఎం. రెడ్డి స్థాపించిన ఈ సంస్థలో మూలా నారాయణస్వామి తోపాటు బి.ఎన్‌. రెడ్డి, ఛాయాగ్రాహకుడు రామనాథ్, కళాదర్శకుడు శేఖర్, బ్రిజ్‌ మోహన్‌ దాస్, నాగిరెడ్డి, సముద్రాల రాఘవాచార్య పార్ట్ నర్స్. నాగయ్య హీరోగా ‘గృహలక్ష్మి’ సినిమా నిర్మించినప్పుడు కె.వి.రెడ్డి క్యాషియర్‌ గా పనిచేశారు.

మూలా నారాయణ స్వామి రోహిణీ సంస్థ నుంచి విడిపోయి బి.ఎన్‌. రెడ్డి, నాగిరెడ్డి, సముద్రాల, బ్రిజ్‌ మోహన్‌ దాసు, కె.వి. రెడ్డి, నాగయ్యలను కలుపుకొని వాహినీ సంస్థను ఏర్పాటుచేశారు. కె.వి.రెడ్డి ఎదగడానికి వాహిని సంస్థ సోపానంగా మారింది. వాహిని పిక్చర్స్‌ బ్యానర్‌ మీద బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం ‘వందేమాతరం’. ఇందులో నాగయ్యతో పాటు కె.వి.రెడ్డి కూడా ఓ పాత్రలో కనిపిస్తారు. బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’, ‘దేవత’ చిత్రాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేశారు. అలా ఆయన సినిమా కెరీర్ దర్శకత్వం చేసే దాకా ఎదిగింది. ‘భక్తపోతన’తో మొదటి సారిగా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. 1943 జనవరి 7న విడుదలైన భక్తపోతన ఘనవిజయం సాధించింది. అక్కడి నుంచి కేవీ రెడ్డికి తిరుగేలేకుండా పోయింది.

కేవీ రెడ్డికి వేమన అంటే అభిమానం. రెండో సినిమాగా ఆ కథతోనే యోగి వేమన తీశారు. దర్శక నిర్మాత వి.శాంతారాం సైతం యోగి వేమన చూసి కేవీ రెడ్డిని ప్రశంసించారు. ఆ తర్వాత జానపద చిత్రాల వైపు ఆయన పయనం సాగిపోయింది. బాలనాగమ్మ, గుణసుందరి కథలాంటి ఆణిముత్యాలెన్నో ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ‘మాయా బజార్‌’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘జగదేకవీరుని కథ’దర్శకుడిగా కె.వి.రెడ్డిని ఆకాశాన నిలబెట్టాయి. ‘జయంతి పిక్చర్స్‌’ స్థాపించి ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ నిర్మించారు. సినిమా రంగంలో అనేక శాఖల్లో వేలుపెట్టిన ఘనత కూడా కేవీ రెడ్డికే దక్కుతుంది. అందుకే ఆయన జగమెరిన దర్శకుడు.

-హేమసుందర్ పామర్తి

Must Read ;- ఏయన్నార్ స్థానంలో శోభన్ బాబుకు చోటు

Tags: b.n reddy and k.v reddychoreographer ramanadhdirector k.v reddy moviesdirector k.v reddy sucess storydirector kv reddy birth anniversaryh.m reddyk.v reddy best moviesk.v reddy biographyk.v reddy educational detailsk.v reddy jayanthik.v reddy latest news'k.v reddy sucess storyk.v reddy wikik.v reddy wikipedia in telugu director k.v reddy director k.v reddy moviesk.v redy historykv reddy historyleotopmula narayana swamyspecial story on k.v reddytollywoodtollywood best director
Previous Post

వీహెచ్ రేంజ్ ఏమిటో తెలిసొచ్చింద‌బ్బా

Next Post

హైకోర్టు చెప్పినా కదలరు!.. సీఎస్‌పైనే 290 కేసులు!  

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Sumaya Reddy Photo Gallery

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Janhvi Kapoor looking hot in Saree

Mahesh Babu’s daughter Sitara Ghattamaneni looks cute like an angel!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist