పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గురించి వింటేనే అభిమానుల్లో పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే పవర్ స్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో హరీష్ శంకర్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. పవర్ స్టార్ సినిమా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అప్పుడే హరీష్ శంకర్ తన స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. అతను తాజాగా బద్రి సినిమాకు సంబంధించిన హై ఓల్టేజ్ సినిమాను పోస్ట్ చేసి, మళ్లీ అదే ఎనర్జీని చూద్దాం అంటూ కామెంట్ పెట్టాడు. ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది.
గబ్బర్ సింగ్ సినిమాతో పవర్ స్టార్ ను అభిమానులు ఎలా ఊహిస్తున్నారో అంతకు మించి చూపించిన హరీష్ శంకర్ ఇలా కామెంట్ పెట్టడంతో అభిమానులు ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతున్నారు. అప్పట్లో ‘దంబాంగ్’ సినిమా పవర్ స్టార్ కు ఏం సూటవుతుంది అన్న విశ్లేషకులందరి నోటి మీద వేలు వేయించిన హరీష్ శంకర్ ఇలా కామెంట్ పెట్టాడంటే సినిమా మామూలుగా ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అయితే బద్రిలో ఉన్న ఎనర్జీ మళ్లీ ఇప్పుడు కావాలంటే పవర్ స్టార్ కు ధీటైన విలన్ కావాలి. బద్రి, వకీల్ సాబ్ సినిమాతో మెప్పించిన ప్రకాష్ రాజ్ నే చూస్తున్నారా? లేక ఇంకెవరైనా హరీష్ మనసులో ఉన్నారా అనేది వేచి చూడాలి. మరో కోణంలో ఆలోచిస్తే.. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా బాట పట్టింది.
కాబట్టి కాస్టింగ్ ను అన్ని భాషల్లో నటీనటులను బాలన్స్ చేస్తూ ఎంపిక చేసే అవకాశం ఉంది అని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా అయినా ప్రకాష్ రాజ్ అన్ని భాషల వాళ్లకు తెలుసు కాబట్టి ఎక్కువ శాతం ప్రకాష్ రాజ్ ను ఈ అవకాశం వరించే అవకాశం ఉందని చెప్పుకోవాలి. హరీష్ సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేస్తున్నాడంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలనే కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు.
Must Read ;- ఒక్క ట్వీట్ తో హీట్ పెంచేసిన హరీష్ శంకర్











