పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్, ఆచార్య, నారప్ప, పుష్ప, సర్కారు వారి పాట.. ఇలా భారీ చిత్రాల రిలీజ్ డౌట్స్ ఎనౌన్స్ చేశారు కానీ.. వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ప్రకటించలేదు ఏంటి అనుకున్నారు. అయితే.. ఈ రోజు వకీల్ సాబ్ విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఇంతకీ ఎప్పుడంటే.. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 9న వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
పవన్ సరసన శృతి హాసన్ నటిస్తే.. అంజలి, నివేథా థామస్, అనన్య ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులోని పాటలు ఆల్రెడీ రిలీజ్ కావడం.. ఆ పాటలు యూబ్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుండడంతో సినిమా పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
అజ్ఞాతవాసి తర్వాత పవన్ నటించిన సినిమా ఇదే. దాంతో పవన్ రీ ఎంట్రీ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్సాన్స్ రావడంతో సినిమాకి బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్స్ వస్తాయని అభిమానులు, చిత్ర నిర్మాత దిల్ రాజు నమ్మకంగా ఉన్నారు. మరి.. వకీల్ సాబ్ రికార్డుల మోత ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Must Read ;- పవన్ టైటిల్ విరూపాక్షి కాదు.. వీరమల్లు